T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

First Published Oct 21, 2021, 8:48 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టులో జరిగిన ఏకైక మార్పు టీమ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను స్టాండ్‌బైకి తప్పిస్తూ, శార్దూల్ ఠాకూర్‌ని ప్లేయింగ్ 15లోకి తీసుకోవడం... ఐపీఎల్ తర్వాత జరిగిన ఈ మార్పుకి మహేంద్ర సింగ్ ధోనీయే కారణమంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన శార్దూల్ ఠాకూర్, 21 వికెట్లు పడగొట్టాడు. ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో కంటే, యూఏఈలో జరిగిన సెకండాఫ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్... 

జట్టుకి అవసరమైన సమయంలో శార్దూల్ ఠాకూర్‌కి బాల్ ఇస్తే చాలు, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను టర్న్ తిప్పడం మొదలెట్టాడు.

ఈ పర్ఫామెన్స్ కారణంగానే టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో శార్దూల్ ఠాకూర్‌కి ప్లేస్ కన్ఫార్మ్ అయిపోయింది...

‘టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ని తుదిజట్టులోకి తీసుకోవడానికి మహేంద్ర సింగ్ ధోనీయే కారణం...

ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడానికి శార్దూల్ ఠాకూర్ ఎంతగానో సహకరించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో శార్దూల్ బౌలింగ్‌కి సీఎస్‌కే బాగా ఉపయోగపడింది...

అందుకే శార్దూల్ ఠాకూర్‌ని తుదిజట్టులో చేర్చాల్సిందిగా మాహీ, కెప్టెన్  విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలకు సూచించి ఉంటాడు. అందుకే అక్షర్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నా, శార్దూల్ తుదిజట్టులోకి వచ్చాడు..’ అంటూ కామెంట్ చేశాడు మైకెల్ వాగన్...

‘టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో శార్దూల్ ఠాకూర్, టీమిండియాకి ట్రంప్ కార్డు అవుతాడు. అతను కచ్ఛితంగా పర్ఫెక్ట్ మ్యాచ్ విన్నర్. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అతని పర్ఫామెన్స్ అదిరిపోతుందని ఆశిస్తున్నా...

విరాట్ కోహ్లీ, శార్దూల్ ఠాకూర్ నుంచి ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఆశిస్తూ ఉండొచ్చు. అతనిలో ఆ టాలెంట్ కూడా ఉంది. నా ఉద్దేశంలో శార్దూల్ ఠాకూర్, బెన్ స్టోక్స్‌తో పోల్చదగినవాడు...’ అంటూ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మౌంటీ పనేసర్ వ్యాఖ్యానించాడు...
 

ఇవీ చదవండి: T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

 T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

click me!