Published : Oct 21, 2021, 10:26 PM ISTUpdated : Oct 21, 2021, 10:29 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్... ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాది దేశాల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అక్టోబర్ 24న జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్‌కి మరింత క్రేజ్ పెంచేందుకు కావాల్సిన మసాలా దినుసులన్నీ జోడిస్తున్నారు ఇరు దేశాల మాజీ క్రికెటర్లు... ఇప్పటికే భజ్జీ, షోయబ్ అక్తర్ ఈ పనిలో చాలా బిజీగా ఉన్నారు...
210
ప్రతీ వరల్డ్‌కప్‌కి ముందు వచ్చే ‘మోకా... మోకా’ యాడ్‌కి కూడా విశేషమైన స్పందన వస్తోంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఐదుసార్లు భారత్ చేతిలో ఓడిన పాక్ ఈ సారైనా గెలుస్తుందా? అంటూ ఆటపట్టిస్తున్నారు...
310
టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు శ్రీనగర్ ప్రాంతంతో తీవ్రవాదుల దాడి, ఎన్‌కౌంటర్ల కారణంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి...
410
బీజేపీ మంత్రులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా.. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మ్యాచ్ నిర్వహించడం అవసరమా? అంటూ నిలదీస్తున్నారు...
510
అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ను కొట్టి వేసింది. ఐసీసీ ఈవెంట్లలో ఏ దేశంతోనైనా ఆడాల్సి వస్తుందని, దాన్ని కేవలం ఓ మ్యాచ్‌గా మాత్రమే చూస్తామంటూ కామెంట్ చేశారు బీసీసీఐ అధికారులు..
610
‘పాక్ మొదట బ్యాటింగ్ చేసి 170+ స్కోరు చేస్తే, భారత జట్టు ఆ స్కోరుని చేధించడం టీమిండియా తరం కాదు... పాక్ పేస్ బౌలింగ్‌ను వాళ్ళు తట్టుకోలేరు...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...
710
‘నేను షోయబ్ అక్తర్‌కి క్లియర్‌గా చెబుతున్నా. మీరు మ్యాచ్ ఆడకుండా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... ఎందుకంటే మీరు మాత్రం ఎన్నిసార్లని మా చేతుల్లో ఓడిపోతారు...
810
మ్యాచ్ ఆడి, ఓడిపోతే మళ్లీ నిరుత్సాహపడాల్సి వస్తుంది... మాకు మంచి టీమ్ ఉంది. వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో పటిష్టమైన జట్టు ఉంది... వాళ్లు మీ జట్టును చిత్తు చేస్తారు...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్..
910
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో కానీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కానీ భారత జట్టు, పాకిస్తాన్ చేతుల్లో ఇప్పటిదాకా ఓడిపోలేదు.
1010
ఏడు వన్డే వరల్డ్‌కప్ మ్యాచుల్లో పాక్‌పై విజయాలు అందుకున్న టీమిండియా, ఐదు టీ20 వరల్డ్‌కప్ మ్యాచుల్లోనూ గెలుపు సాధించింది...