Published : Oct 22, 2021, 05:32 PM ISTUpdated : Oct 22, 2021, 05:34 PM IST
టీ20 వరల్డ్‌కప్ టోర్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 160 మిలియన్లకు ఫాలోవర్లను సొంతం చేసుకున్న కోహ్లీ, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీల్లో ఒకటిగా ఉన్నాడు...
పొరుగు దేశం పాకిస్తాన్‌లో కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. కరాచీలో ఓ వ్యక్తి, విరాట్ కోహ్లీ మీద ఉన్న వీరాభిమానంతో తన ఇంటి మీద భారత జెండా ఎగురవేయడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది...
29
అయితే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కంటే ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పాకిస్తాన్‌లో ఫాలోయింగ్ ఎక్కువని అంటున్నాడు పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్...
39
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇండియా, పాకిస్తాన మధ్య మ్యాచ్‌ను ప్రమోట్ చేస్తూ... భారత మాజీ క్రికెటర్లతో ఇంటర్వ్యూలు ఇస్తూ, ఫుల్లు బిజీ బిజీగా గడుపుతున్నాడు షోయబ్ అక్తర్...
49
అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే దాయాదుల పోరును... ‘ఫైనల్‌కి ముందు మెగా ఫైనల్’గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
59
‘పాకిస్తాన్‌లో కూడా టీమిండియా క్రికెటర్లకు అభిమానులున్నాయి. మా దేశంలో విరాట్ కోహ్లీ ఆటను, బుమ్రా, షమీ బౌలింగ్‌ను ఎంతగానో ఇష్టపడతారు...
69
అక్కడ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకు ఫాలోయింగ్ ఎక్కువ. రోహిత్‌ను మా దేశంలో ‘ఇండియాకా ఇంజమామ్’ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...
79
‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై భారీ హైప్ ఉంది. అలాంటి బిగ్ మ్యాచులు గెలవాలంటే పెద్ద స్టార్లు ఉంటే సరిపోదు, గుండె ధైర్యం కూడా కావాలి... ఇండియాలో మంచి ప్లేయర్లు ఉన్నారు...
89
పాక్ క్రికెటర్లతో పోలిస్తే, భారత క్రికెటర్లకు అనుభవం కూడా చాలా ఎక్కువే. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా కీలకం...
99
టీ20ల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. నాకు తెలిసి ఈ మ్యాచ్ 50-50గా సాగుతుంది. ఆ రోజు ఎవరు అదరగొడతారో, వాళ్లకే విజయం దక్కుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...