T20 worldcup 2021: టీమిండియాకి అంత సీన్ లేదు, వాళ్లు ఫెవరెట్స్ ఎలా అవుతారు... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్...

First Published Oct 20, 2021, 5:55 PM IST

T20 worldcup 2021: టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో ఫెవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది టీమిండియా. 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ మెంటర్‌గా ఉండడంతో పాటు విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఇదే మొదటి, చివరి టీ20 వరల్డ్‌కప్ కావడంతో టమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి...

గత రెండు సీజన్లుగా ఐపీఎల్ మ్యాచులు జరిగిన యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగుతుండడంతో భారతజట్టు హాట్ ఫెవరెట్లలో ఒకటిగా పరిగణించబడుతోంది...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో కూడా టీ20 సిరీస్‌లు గెలిచింది భారత జట్టు... అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకెల్ వాగన్ మాత్రం భారత జట్టుకి అంత సీన్ లేదంటూ కొట్టిపారేస్తున్నాడు...  

‘నా దృష్టిలో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఫెవరెట్. టీ20ల్లో టీమిండియాకి ఫెవరెట్ ట్యాగ్ ఎలా దక్కించుకుందో అర్థం కావడం లేదు. వాళ్లు చాలా నెలల క్రితం కలిసికట్టుగా టీ20 సిరీస్ ఆడారు..

వారికి టైటిల్ గెలిచేంత సీన్ లేదు. ఎందుకంటే వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల నుంచి టీమిండియాకి గట్టి పోటీ ఎదురుకానుంది. పాకిస్తాన్‌ కూడా అంతే... పాక్‌తో పోలిస్తే న్యూజిలాండ్‌లో హై క్లాస్ ప్లేయర్లు ఉన్నాయి...

కివీస్ ప్లేయర్లు, ప్రతీ మ్యాచ్‌కి ముందు ఎలా గెలవాలో పక్కా ప్లానింగ్‌తో బరిలో దిగుతారు. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన ఉత్సాహం కూడా వారిలో నిండి ఉంటుంది. అది న్యూజిలాండ్‌కి డబుల్ అడ్వాంటేజ్ కావచ్చు...

నేను పక్కాగా చెప్పగలను, ఆస్ట్రేలియాకి పెద్దగా అవకాశాలు లేవు. వాళ్లు టీ20 క్రికెట్‌లో కుదురుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే, ఆసీస్ టీమ్‌లో మ్యాచ్ విన్నర్‌గా కనిపిస్తున్నాడు... 

ఈసారి మ్యాక్స్‌వెల్ అదరగొడతాడని అనుకుంటున్నా, అయితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం పెద్దగా విజయాలు అందుకోలేదు. ఇంగ్లాండ్, ఇండియా, వెస్టిండీస్, న్యూజిలాండ్... వీళ్లు టాప్ 4లో ఉండొచ్చు....

యూఏఈ పిచ్ పరిస్థితులను సరిగా వాడుకుంటే పాకిస్తాన్ కూడా టాప్‌ 4లోకి రావచ్చు... కానీ టైటిల్ ఫెవరెట్స్ మాత్రం ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లే... ఐపీఎల్ 2021 సీజన్‌కి వాడిన పిచ్‌లపై టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మ్యాచులు జరుగుతున్నాయి...

కాబట్టి ఈ వాడిన పిచ్‌లపై భారీ స్కోర్లు నమోదు కావడం చాలా కష్టమే. 150- 160 మధ్యలో పరుగులు చేసినా, ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడానికి అవకాశాలు ఉంటాయి...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్...

ఇవీ చదవండి: రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

click me!