నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Oct 20, 2021, 4:14 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాను బాగా ఇబ్బందిపెడుతున్న విషయం హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి సరిపడా ఫిట్‌నెస్ సాధించకపోవడం, భారత జట్టును ఇబ్బంది పెడుతోంది. టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతనికి చోటు దక్కినా, బౌలింగ్ చేయలేకపోతే తుదిజట్టులో చోటు ఉండడం అనుమానమే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మహా అయితే ఐదుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాట్స్‌మెన్, ఓ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగుతుంది భారత జట్టు. 

ఐదుగురు బౌలర్లు ఏ ఒక్క బౌలర్ భారీగా పరుగులు సమర్పిస్తున్నా, అతని స్థానంలో ఒకటి రెండు ఓవర్లు వేసేందుకు మరో బౌలర్ అందుబాటులో ఉండడు. 

పేస్ ఆల్‌రౌండర్ జట్టులో అందుబాటులో ఉంటే, ఈ సమస్య తలెత్తదు. అందుకే ఇన్నాళ్లు హార్దిక్ పాండ్యా, జట్టులో కీలక ప్లేయర్‌గా ఉండేవాడు. 

అయితే గాయం కారణంగా అతను బౌలింగ్ చేయలేకపోవడంతో ఇప్పుడు పాండ్యా ఆల్‌రౌండర్‌గా కాకుండా, కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు..

ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.... ‘హార్ధిక్ పాండ్యా ఇంకా బౌలింగ్ చేయడానికి తగిన ఫిట్‌నెస్ సాధించలేదు... అయితే అతను దానిపై పూర్తి ఫోకస్ పెట్టాడు...

మరో వారం రోజుల్లో పాండ్యా బౌలింగ్ చేయగలుగుతాడని అంచనా వేస్తున్నాం. ఒకవేళ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ వేయలేకపోయినా... నేను, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేస్తాం...

కానీ మా బౌలర్లు అదరగొడుతున్నారు. ఐదుగురికి ఐదుగురు మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టి ఆ అవసరం రాదనే ఆశిస్తున్నాం... ’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

చెప్పినట్టుగానే ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో తుదిజట్టులో లేని విరాట్ కోహ్లీ... సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చి బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..  

click me!