Suriya Favourite Cricketer: సూర్య కు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా?

Published : Jul 23, 2025, 08:02 PM IST

Suriya Favourite Cricketer: భారత సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సూర్య.. తన సినిమా ప్రమోషన్ కోసం ఎక్స్ లో ఫ్యాన్స్ తో లైవ్‌ సెషన్ లో పాల్గొన్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్ సురేష్ రైనా లైవ్ లోకి వచ్చి మీకు ఇష్టమైన క్రికెట్ ఎవరని అడిగారు.

PREV
15
హ్యాపీ బర్త్ డే సూర్య

భారతీయ సినీ రంగంలో తనదైన ముద్రవేసిన తమిళ స్టార్ హీరో సూర్య నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా.. విభిన్న నేపథ్యంలో కలిగిన కథలో గుర్తింపు పొందారు.

సూర్యకు భారతదేశం అంతటా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన ఇప్పుడు నేరుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సూర్య బర్త్ డే సందర్భంగా తన 46వ చిత్రం కరుప్పు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

25
సూర్య ఫ్యాన్ లైవ్ సెషన్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సురేష్ రైనా

తమిళ నటుడు సూర్య తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫ్యాన్స్ తో లైవ్ లో ముచ్చటించారు. అయితే, సూర్యకు సర్ప్రైజ్ ఇస్తూ లైవ్ సెషన్ లోకి టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా వచ్చారు.

సూర్య తన సినిమా విషయాల గురించి మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది. సాయంత్రం సమయంలో ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్) లో లైవ్‌కి వచ్చారు. అభిమానులతో #AskSuriya సెషన్‌లో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా, సురేశ్ రైనా కూడా వచ్చి ఆయనకు ఒక ఆసక్తికర ప్రశ్న వేశారు.

35
సూర్య కు రైనా ఏం ప్రశ్న వేశారు?

ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడిన ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనాకు సూర్య అంటే ఇష్టం. చెన్నై క్రికెట్ లవర్స్ ప్రేమతో “చిన్న తల”గా పిలుచుకునే రైనా.. సూర్య ఎన్జీకే మూవీ ప్రమోషన్ లైవ్‌లోకి వచ్చి.. “మీకు సీఎస్కే (CSK) లో ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ఎందుకు?” అని అడిగారు. ఈ ప్రశ్న సూర్య ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సమాధానమిచ్చారు.

45
సూర్య కు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?

రైనా ప్రశ్నకు సూర్య స్పందిస్తూ.. “నిజంగా ఇది నమ్మలేక పోతున్నాను. మీలాంటి గొప్ప ఆటగాడు నా లైవ్‌లోకి వచ్చి నాకు ప్రశ్న అడగడం చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబానికి, మీ ‘లిటిల్ ప్రిన్సెస్’కి నా ప్రేమను తెలుపుతున్నాను. మీరు ఆడిగిన విషయంలో సూటిగా చెప్తాను.. నాకు ఇష్టమైన క్రికెటర్ 'మిస్టర్ మాహి.. ఎంఎస్ ధోనీ'. చెన్నై టీమ్‌లో మొదట ఆయన్నే కలిశాను. ఆ తర్వాత చెన్నైలో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోను” అని సూర్య చెప్పారు.

అలాగే, “మనం కలిసి దిగిన ఫోటో నాకు ఇప్పటికీ గుర్తుంది. అది ఒక మధురమైన జ్ఞాపకం. మీరు ముందుగా వచ్చి హాయ్ చెప్పిన తీరు కూడా మర్చిపోలేను. ఆ సీజన్ బాగా ఎంజాయ్ చేశాను. అలాగే, నేను జీవితాంతం సీఎస్కే అభిమానినే” అని సూర్య అన్నారు.

55
ధోనీ కూడా సూర్య అభిమాని తెలుసా !

భారత మాజీ కెప్టెన్ ధోనీ గతంలో చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) ఫైనల్ మ్యాచ్‌కి హాజరయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “రజనీకాంత్ తర్వాత నాకు ఇష్టమైన నటుడు సూర్య. ఆయన నటించిన ‘సింగం’ సినిమాను తమిల్‌లో సబ్‌టైటిల్స్‌తో చూసాను. చాలా బాగా నచ్చింది” అని అన్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది.

కాగా, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు, తమిళ సినీ నటుల మధ్య మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభం నుంచే ఈ బంధం మరింత బలపడుతూ వస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories