Yuzvendra Chahal: డ్యాన్స్‌ క్లాస్ నుంచి పెళ్లి వరకు… డైవోర్స్‌తో ముగిసిన ప్రేమకథ !

Published : Jul 23, 2025, 09:54 AM IST

Yuzvendra Chahal: భారత స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కెరీర్ మైలురాళ్లు, ధనశ్రీతో ప్రేమ, పెళ్లి, డైవోర్స్‌ కథ వైరల్‌గా మారింది.

PREV
16
యుజ్వేంద్ర చాహల్: ప్రేమ కథ నుండి విడాకుల వరకు

ఇండియన్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కెరీర్ పరంగా అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో మెరిసిన చాహల్, వ్యక్తిగత జీవితంలోనూ ఊహించని మలుపులను ఎదుర్కొన్నాడు. ప్రేమ, పెళ్లి, విడాకుల వంటి విభిన్న అనుభవాల మధ్య ఆయన ప్రయాణం సోషల్ మీడియాతో పాటు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

26
లాక్‌డౌన్ లో మొదలైన యుజ్వేంద్ర చాహల్ ప్రేమ కథ

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టిన సమయంలో భారత్ లో కూడా లాక్ డౌన్ విధించారు. 2020లో లాక్‌డౌన్ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ ఆన్‌లైన్ డాన్స్ క్లాస్‌లో చేరడం ద్వారా వారి పరిచయం మొదలైంది. వర్చువల్ కనెక్షన్ నుంచి వీరి లవ్ స్టోరీ మొదలైంది. కొంత కాలం డేటింగ్ చేశారు.

36
యుజ్వేంద్ర చాహల్ డ్యాన్స్ టీచర్‌ నుండి జీవిత భాగస్వామిగా ధనశ్రీ

ఈ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. కొంతకాలం డేటింగ్ తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 8, 2020న ఇన్‌స్టాగ్రామ్‌లో వారి నిశ్చితార్థం పోస్టు వైరల్ గా మారింది. డిసెంబరు 22, 2020న గురుగ్రామ్‌లో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

46
సోషల్ మీడియాలో స్టార్ జోడీగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ

పెళ్లి అనంతరం చాహల్–ధనశ్రీ జంట తమ డ్యాన్స్ వీడియోలు, ఫొటోలు, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో స్టార్ జోడీగా మారారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియం లో ధనశ్రీ హాజరై చాహల్‌కు మద్దతు తెలపడం అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. దీంతో చూడముచ్చటైన జంటగా వీరు మరింత గుర్తింపును పొందారు.

56
యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడాకుల వార్తలతో అభిమానుల్లో కలకలం

2023 తర్వాత ఈ జంటపై గాసిప్‌లు పెరగడం మొదలైంది. వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, కలసి ఉన్న ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అభిమానుల్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 2025లో ముంబయి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేశారు. జూలై 2025లో విడాకులు అధికారికంగా మంజూరు అయ్యాయి.

66
విడాకుల తర్వాత కొత్త ప్రయాణంలో చాహల్, ధనశ్రీ

యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు క్రికెట్, ఫిట్‌నెస్‌పై దృష్టి కేంద్రీకరించారు. ధనశ్రీ తన డాన్స్, ఇన్‌ఫ్లుఎన్సర్ జీవితం కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇద్దరూ వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వడం ద్వారా అభిమానుల మద్దతును కూడా పొందారు. విడాకులు తీసుకునే ముందు వీరిద్దరూ కూడా అనేక మిశ్రమ స్పందనలను ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా ధనశ్రీ భారీగా భరణం డిమాండ్ చేశారనే విషయం వైరల్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories