Travis Head Net Worth : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ దుమ్మురేపుతున్నాడు. అయితే, హెడ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? ట్రావిస్ హెడ్ ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ జీతం, ఆస్తులు, ఆదాయ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో విధ్వంసకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ట్రావిస్ హెడ్, మైదానంలోనే కాకుండా సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. 2026 నాటికి ఆయన నెట్ వర్త్ సుమారు ₹62 కోట్లు (7.2 మిలియన్ డాలర్లు) గా అంచనా. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన చూపిన అద్భుత ప్రతిభ, ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌లు ఆయన బ్రాండ్ విలువను భారీగా పెంచాయి.
25
ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జాక్‌పాట్
ట్రావిస్ హెడ్ సంపాదన పెరగడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కీలక పాత్ర పోషించింది. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన ఆయనను, 2025, 2026 సీజన్ల కోసం ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. 2024లో ₹6.8 కోట్లు ఉన్న ఆయన వేతనం, 2025 నాటికి ఏకంగా ₹14 కోట్లకు పెరిగింది. అంటే కేవలం రెండేళ్లలో ఆయన ఐపీఎల్ ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువయ్యింది. ఆరెంజ్ ఆర్మీలో కీలక ఆటగాడిగా మారిన హెడ్, తన దూకుడైన బ్యాటింగ్‌తో ఈ భారీ మొత్తానికి అర్హుడని నిరూపించుకున్నాడు.
35
ట్రావిస్ హెడ్ జాతీయ కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్
కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా, క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి కూడా హెడ్ భారీగా ఆర్జిస్తున్నాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి సుమారు ₹8.5 నుంచి ₹11 కోట్ల వరకు వేతనం పొందుతున్నాడు. దీనికి అదనంగా ఐసీసీ టోర్నమెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా మ్యాచ్ ఫీజులు, బోనస్‌ల రూపంలో మరో ₹2 నుంచి ₹4 కోట్లు లభిస్తున్నాయి.
ట్రావిస్ హెడ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయానికి వస్తే.. అడిడాస్, గ్రే-నికోల్స్, కూకబుర్రా వంటి ప్రముఖ కంపెనీలతో ఆయనకు ఒప్పందాలు ఉన్నాయి. ఏప్రిల్ 2026లో ట్రేడిఫై అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఆయన బ్యాట్ వెనుక భాగంలో ఆ బ్రాండ్ లోగో కనిపిస్తుంది. దీని ద్వారా ఏటా ₹7 నుంచి ₹10 కోట్ల ఆదాయం వస్తోంది.
ఆదాయం పెరగడంతో ట్రావిస్ హెడ్ తన లైఫ్ స్టైల్ ను కూడా అదే స్థాయిలో మార్చుకున్నాడు. అడిలైడ్‌లో ఆయనకు సుమారు ₹10 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం ఉంది. అలాగే మెర్సిడెస్, ఆడి వంటి ప్రీమియం కార్ల కలెక్షన్ హెడ్ వద్ద ఉంది, వీటి విలువ దాదాపు ₹4 నుంచి ₹5 కోట్లు ఉంటుంది. హెడ్ భార్య జెస్సికా హెడ్ కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. కాన్బెర్రా, సిడ్నీలలో ఆమె పలు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతూకం చేసుకుంటూ హెడ్ తన ఆస్తులను పెంచుకుంటున్నాడు.
55
₹58 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రావిస్ హెడ్.. ఎందుకంటే?
ట్రావిస్ హెడ్ తన దేశంపై ఉన్న నిబద్ధతను చాటుకుంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2025 చివరిలో ఒక పేరు తెలియని ఐపీఎల్ ఫ్రాంచైజీ, ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పి కేవలం టీ20 లీగ్‌లలో ఆడాలని ప్రతిపాదించింది. దీని కోసం ఏడాదికి ఏకంగా ₹58 కోట్లు ($10 మిలియన్ AUD) ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా తరఫున ఆడటమే తన ప్రాధాన్యం అని పేర్కొంటూ హెడ్ ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడని రిపోర్టులు పేర్కొన్నాయి.