అజింక్యా రహానే కనిపించేంత అమాయకుడేం కాదుగా.. సోదరి ఫ్రెండ్ ను ఎలా పటాయించాడో తెలుసా..?

Published : Mar 30, 2026, 02:00 PM IST

KKR కెప్టెన్ అజింక్యా రహానే గురించి మనందరికీ తెలుసు, కానీ ఆయన భార్య, పిల్లల గురించి చాలామందికి తెలియదు.  అతడి సినిమా రేంజ్ ప్రేమకథ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
అజింక్యా రహానే లవ్ స్టోరీ..

అజింక్యా రహానే భార్య పేరు రాధికా ధోపావ్కర్. వీరిద్దరి ప్రేమకథ స్నేహంతో మొదలైంది. ఇద్దరూ ముంబైలోని ములుంద్ ఏరియాలో ఒకే సొసైటీలో ఉండేవారు. రాధిక, రహానే సోదరికి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో వాళ్లింటికి తరచూ వస్తుండేది. అలా చిన్నప్పటి పరిచయం బలమైన స్నేహంగా మారింది.

25
స్నేహితులే ప్రేమికులయ్యారు..

రహానే, రాధిక కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాక, వాళ్ల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2007లో కాలేజీ రోజుల్లో తమ బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని ఇద్దరికీ అర్థమైంది. అక్కడి నుంచే వాళ్ల అసలైన ప్రేమకథ మొదలైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు.

35
రహానే-రాధిక పెళ్లి..

అజింక్యా, రాధికల బంధం ఎప్పుడూ చాలా సింపుల్‌గా ఉండేది. వాళ్లు తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ పబ్లిసిటీ కోసం వాడుకోలేదు. మీడియాలో కూడా పెద్దగా చర్చకు రాలేదు. దాదాపు ఏడేళ్ల పాటు చాలా ప్రైవేట్‌గా ఉంటూ ఒకరికొకరు సమయం ఇచ్చుకున్నారు.

ఏడేళ్ల డేటింగ్ తర్వాత 2014 సెప్టెంబర్ 26న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముంబైలో మరాఠీ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు దాదాపు 1500 మంది అతిథులు, బంధువులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు.

అయితే పెళ్లికి రహానే టీ-షర్ట్, జీన్స్‌తో వచ్చేశాడట. అది చూసి రాధిక కాస్త అలిగిందట. తర్వాత రహానే సంప్రదాయ దుస్తులు వేసుకోవడంతో అంతా సెట్ అయింది. ఇలా రహాన్ పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగిందని చెబుతుంటారు.

45
రహానే కు రాధిక అభిమాని...

రాధిక కేవలం సపోర్టివ్ పార్ట్‌నరే కాదు, రహానేకు అతిపెద్ద అభిమాని కూడా. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడిని ఉత్సాహపరుస్తుంది. 2019లో వీరికి కూతురు ఆర్య, 2022లో కొడుకు రాఘవ్ పుట్టారు. ఇప్పుడు ఈ జంట తమ పిల్లలతో హ్యాపీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో తరచూ ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటారు.

55
రాధిక ఏం చదివిందో తెలుసా..?

రహానే మైదానంలో దేశం కోసం ఆడుతుంటే, రాధిక అతడికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఆమె వినాయక్ గణేష్ వాజే కాలేజీలో ఇంటీరియర్ డిజైనింగ్ చదివింది. ఆ రంగంలో పనిచేసింది కూడా. కానీ, రహానే బిజీ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. చాలాసార్లు విదేశీ పర్యటనల్లోనూ భర్తతో పాటు వెళ్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories