SRH vs RCB కాదు కావ్య మారన్ vs అనన్య బిర్లా .. స్టైల్‌లో ఎవరు నెం.1..?

Published : Mar 28, 2026, 11:01 AM IST

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరు మధ్యే కాదు... ఇద్దరు యంగ్ ఓనర్ల మధ్య కూడా ఆసక్తికరమైన ఫైట్ జరగనుంది. ఒకరు SRH ఓనర్ కావ్య మారన్, మరొకరు RCB కొత్త ఓనర్ అనన్య బిర్లా. వీరిద్దరి స్టైల్, ఫ్యాషన్‌పై ఓ లుక్కేయండి.

PREV
17
ఐపీఎల్ 2026 ఫ్యాషన్ ఫేస్-ఆఫ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (19 సీజన్) ఇవాళ (శనివారం, మార్చి 28న) మొదలవుతోంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తెలుగు టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లతో పాటు ఇద్దరు ఓనర్లపైనా అందరి కళ్లూ ఉంటాయి. ఒకరు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ అయితే, మరొకరు RCB లేటెస్ట్ ఓనర్ అనన్య బిర్లా. ఈ ఇద్దరూ యంగ్, పవర్‌ఫుల్, స్టైలిష్… కానీ వారి ఫ్యాషన్ సెన్స్ మాత్రం పూర్తి భిన్నం.

27
ఎవరీ కావ్య మారన్

కావ్య మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌కు సీఈఓ. ఆమె 1992లో జన్మించారు. ఐపీఎల్ మ్యాచ్‌లప్పుడు తన టీమ్‌ను సపోర్ట్ చేస్తూ కావ్య గ్రౌండ్‌లో కనిపిస్తారు... ఎమోషన్స్ ను అదుపుచేసుకోకుండా మైదానంలో ప్రదర్శిస్తుంటారు. ఆనందం, ధు:ఖం, కోపం, నవ్వు, చిరాకు… మ్యాచ్ సాగుతున్న విధానాన్ని బట్టి ఆమె ముఖంలో భావాలు మారుతుంటాయి. అందుకే కీలక సమయాల్లో కెమెరామెన్ పదేపదే కావ్యను చూపిస్తుంటాడు… దీంతో క్రికెటర్ల స్థాయిలో ఆమెకు గుర్తింపు లభించింది. 

37
ఎవరీ అనన్య బిర్లా

అనన్య బిర్లా ఒక బిజినెస్ వుమెన్ మాత్రమే కాదు అంతర్జాతీయ పాప్ సింగర్, సోషల్ వర్కర్ కూడా. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూతురే ఈ అనన్య. కేవలం 17 ఏళ్ల వయసులోనే 'ఇండిపెండెంట్ మైక్రోఫిన్' సంస్థను ప్రారంభించారు. ఇలా చిన్న వయసులోనే సక్సెస్‌ఫుల్ మహిళగా నిలిచారు.

47
కావ్య vs అనన్య... స్టైల్ విషయంలో ఎవరు టాప్

కావ్య మారన్ లుక్ చాలా సింపుల్‌గా, క్లాసీగా, ఎలిగెంట్‌గా ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లప్పుడు ఆమె ఎక్కువగా తక్కువ మేకప్‌తో, స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌లో కనిపిస్తారు. ఆమె స్టైల్ 'లెస్ ఈజ్ మోర్' అనే కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. సాలిడ్ కలర్స్, సింపుల్ జ్యువెలరీ, మినిమల్ లుక్‌ను ఇష్టపడతారు.

57
అనన్య బిర్లా స్టైల్

అనన్య బిర్లా స్టైల్ చాలా బోల్డ్, మోడ్రన్, గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె ఎక్కువగా బ్లేజర్ సూట్స్, ట్రెండీ డ్రెస్సులు, హై ఫ్యాషన్ లుక్స్‌లో కనిపిస్తారు. ఆమె స్టైల్ కార్పొరేట్, పార్టీ లుక్స్ రెండింటినీ మిక్స్ చేసినట్టు ఉంటుంది. ప్రయోగాలు చేయడానికి అనన్య అస్సలు భయపడరు. బ్రైట్ కలర్స్, లూజ్ ఫిట్, ట్రెండీ అవుట్‌ఫిట్స్ ధరిస్తారు.

67
సోషల్ మీడియాలో ఎవరిది పైచేయి

సోషల్ మీడియాలో అనన్య బిర్లా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారి కోసం ఆమె తరచుగా తన బోల్డ్, అందమైన ఫోటోలను షేర్ చేస్తుంటారు.

ఇక కావ్య మారన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. ఐపిఎల్ సమయంలో సన్ రైజర్స్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఆమె ఎక్కువగా కనిపిస్తుంటారు. 

77
మ్యాచ్‌లో ఇద్దరిపైనే ఫోకస్!

మార్చి 28న RCB, SRH మ్యాచ్ జరిగినప్పుడు, గ్రౌండ్‌లో ఆటగాళ్లు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటే, స్టాండ్స్‌లో కావ్య మారన్‌ను చూపించాలా లేక అనన్య బిర్లాను చూపించాలా అని కెమెరా టీమ్ కన్‌ఫ్యూజ్ అవ్వడం ఖాయం. వారిద్దరి రియాక్షన్స్‌ను క్యాప్చర్ చేయడమే పెద్ద టాస్క్ అవుతుంది. ఐపీఎల్ అభిమానులకు మ్యాచ్‌తో పాటు ఇలాంటి ఆఫ్-ఫీల్డ్ ఎక్సైట్‌మెంట్ కూడా చాలా ఇష్టం.

Read more Photos on
click me!

Recommended Stories