కోహ్లీని దాటేసింది ! స్మృతి మంధాన ప్రపంచ రికార్డు

Published : Oct 12, 2025, 09:45 PM IST

Smriti Mandhana: స్మృతి మంధాన మహిళా వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 రన్స్ చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. ఇదే కాకుండా ఆస్ట్రేలియాతో విశాఖ మ్యాచ్ లో పలు రికార్డుల మోత మోగించింది.

PREV
16
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆమె అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది. 

ఒకే క్యాలెండర్  ఇయర్ లో 1000 వన్డే రన్స్ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది. ఈ రికార్డుతో ఆమె ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ 1997లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది.

26
1000 వన్డే రన్స్‌తో స్మృతి మంధాన ప్రపంచ రికార్డు

స్మృతి మంధాన విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తన 18వ వన్డే ఆడింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆమెకు ఈ రికార్డుకు కావాల్సింది కేవలం 18 రన్స్ మాత్రమే. ఎనిమిదో ఓవర్‌లో సోఫీ మోలినక్స్ వేసిన బంతిని సిక్స్‌గా కొట్టి ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 1997లో బెలిండా క్లార్క్ 16 వన్డేల్లో 970 రన్స్ చేసి ఆ రికార్డు సృష్టించింది. ఇప్పుడు స్మృతి మంధాన 1000 రన్స్ పూర్తి చేసి కొత్త చరిత్రను రాసింది.

36
5000 రన్స్ మైలురాయి దాటిన స్మృతి మంధాన

ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 80 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. తన నాక్ లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదారు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేల్లో 5000 రన్స్ పూర్తి చేసిన ప్రపంచంలో ఐదవ మహిళా ప్లేయర్ గా, భారతదేశం తరపున రెండవ బ్యాటర్‌గా నిలిచింది.

ఆమె కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించింది. మిథాలీ తన కెరీర్‌లో 7805 రన్స్ సాధించింది. ఇప్పుడు స్మృతి మంధాన ఆ జాబితాలో ఆమె తరువాత స్థానంలో నిలిచింది.

46
ప్రతికా రావల్‌తో 155 రన్స్ భాగస్వామ్యం

స్మృతి మంధాన తో పాటు ఓపెనర్ ప్రతికా రావల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఇద్దరూ కలిసి 155 రన్స్ ఓపెనింగ్ పార్టనర్‌షిప్ అందించారు. ఇది మహిళా వన్డేల్లో భారత్ తరఫున రెండవ అత్యధిక 50+ భాగస్వామ్యాల రికార్డు (14 సార్లు). దీంతో అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్ జోడీని అధిగమించారు. మంధాన-రావల్ భాగస్వామ్యం వల్ల భారత జట్టు ప‌వ‌ర్‌ప్లేలో 58 రన్స్ చేసింది.

56
వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ కంటే వేగంగా 5 వేల పరుగులు చేసిన స్మృతి మంధాన

స్మృతి మంధానకు 5000 వన్డే పరుగులు చేరుకోవడానికి కేవలం 112 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టాయి. ఈ రికార్డు వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 5000 రన్స్ పూర్తి చేసిన మహిళా ప్లేయర్ గా నిలిచింది. ఈ రికార్డు ఇంతకు ముందు వెస్టిండీస్ స్టార్ స్టెఫనీ టేలర్ పేరిట ఉండేది. ఆమె 129 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును సాధించారు. 

పురుషులు, మహిళలను కలిపి చూస్తే స్మృతి మంధాన మూడో స్థానంలో ఉన్నారు. ఆమె కంటే ముందు బాబర్ ఆజమ్ (97 ఇన్నింగ్స్), హషీమ్ ఆమ్లా (101 ఇన్నింగ్స్) మాత్రమే ఉన్నారు. స్మృతి మంధాన ఈ విషయంలో వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ, షాయ్ హోప్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టింది.

66
అద్భుత ఫామ్‌లో స్మృతి మంధాన

2025 సంవత్సరంలో స్మృతి మంధాన సెంచరీల మోత మోగిస్తోంది. ఐర్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడింది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఆమె 8, 23, 80 రన్స్ చేసింది. మొదటి రెండు మ్యాచ్ లలో నిరాశపర్చింది. కానీ, మళ్లీ ఆమె ప్రదర్శనతో భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ వైపు మళ్లింది. ప్రస్తుతం ఆమె ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories