AFG Vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బలమైన ప్రదర్శన కనబరిచింది. బంగ్లాదేశ్‌పై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆతిథ్య జట్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ స్కోర్ చేసినప్పటికీ.. లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 300 పరుగులు చేశాయి.
25
ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప లక్ష్యం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ పెద్దగా రాణించలేకపోయింది. 44.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యం బంగ్లాదేశ్‌కు చాలా సులభతరం అని అందరూ భావించారు. కానీ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొత్తం మ్యాచ్‌ను మార్చేశాడు. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తన తొలి వికెట్‌ను ఖాతా తెరవకుండానే కోల్పోయింది.
35
రషీద్ ఖాన్ సూపర్బ్ స్పెల్
ఈ ఎదురుదెబ్బ నుంచి ఆ జట్టు కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. రషీద్ 8.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముఖ్యంగా అతడు మొత్తం 38 డాట్ బాల్స్ వేసి, కేవలం 2 ఎకానమీ రేట్‌తో ఐదు వికెట్లు తీశాడు. ఇది బంగ్లాదేశ్‌ను పూర్తిగా దెబ్బతీసింది.
రషీద్ తన ఇన్నింగ్స్‌లో తోహిద్ హ్రిడోయ్, నూరుల్ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం లాంటి బంగ్లాదేశ్ కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. అంతేకాకుండా అతడు ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా, బంగ్లాదేశ్ 28.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 81 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
55
ఇబ్రహీం జాద్రాన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్
అంతకుముందు, ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో అతను 140 బంతులు ఎదుర్కొని 95 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా మొత్తం జట్టు చేసిన స్కోర్‌లో సగం అతడే ఒంటిచేత్తో సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.