పంత్ ఔటైన తర్వాత, గిల్‌కు జడేజా మద్దతు అందించాడు. జడేజా బ్యాటింగ్ పై విమర్శలు వస్తున్న క్రమంలో గిల్ తో కలిసి మంచి నాక్ ఆడాడు. ఇప్పుడు 41* పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి గిల్ 114 పరుగులు, జడేజా 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 310/5 పరుగులు చేసింది.
మొదటి టెస్టులో గిల్ 147 పరుగులు చేసినా భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడింది. రెండో టెస్ట్‌లో గిల్ సెంచరీతో బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నాడు. భారత జట్టు విజయానికి ముందుండి పోరాడుతున్నాడు.
అలాగే, వరుసగా రెండు టెస్టుల్లో కెప్టెన్‌గా 50కి పైగా పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో విజయ్ హజారే, సునీల్ గావస్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఉన్నారు.