Yashasvi Jaiswal: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యచ్ లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.
IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్‌లో యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఇన్నింగ్స్
భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. రెండో టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 107 బంతుల్లో 87 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు. జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 13 బౌండరీలు బాదాడు.
ఈ ఇన్నింగ్స్‌తో పాటు జైస్వాల్ ఇప్పుడు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA దేశాలు)లలో ఓపెనర్‌గా ఐదు అర్ధసెంచరీలతో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ ఖాతాలో నాలుగు మాత్రమే ఉన్నాయి. జైస్వాల్ కేవలం 21 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.
26
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు.
అయితే యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. నాయర్ 31 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వికెట్ ను సమర్పించుకున్నాడు.
జైస్వాల్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరోసారి సెంచరీకి దాదాపు చేరువయ్యాడు. అయితే, లంచ్ బ్రేక్ కు ముందు ఓ వైడ్ బంతిని కట్ చేయబోయి స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ గా దొరికిపోయాడు.
36
ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఓపెనర్ గా జైస్వాల్ రికార్డు
ఈ ఇన్నింగ్స్‌తో యశస్వి జైస్వాల్ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సుధీర్ నాయిక్ పేరిట ఉండగా, ఆయన 1974లో 77 పరుగులు చేశారు.
ఇప్పుడు జైస్వాల్ 87 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు, సునీల్ గవాస్కర్ 1979లో 68, 61 పరుగులు చేయగా, ఛతేశ్వర్ పుజారా 2022లో 66 పరుగులు చేశారు.
ప్రస్తుతం జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో 2000 పరుగుల మార్క్‌కు కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఘనతను వేగంగా సాధించిన భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌లు 40 ఇన్నింగ్స్‌లలో ఆ రికార్డు సాధించారు.
జైస్వాల్ అదే సంఖ్యలో పూర్తిచేయాలంటే రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 పరుగులు చేయాల్సి ఉంటుంది.
56
తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్
అంతకుముందు, లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 159 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 11 బంతుల్లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేసి, జట్టుకు తీవ్ర నష్టం కలిగించాడు.
66
సెంచరీతో కెప్టెన్ నాక్ ఆడిన శుభ్ మన్ గిల్
రెండో టెస్టులో కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీని పూర్తి చేశాడు. వరుసగా రెండో టెస్టులో సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం గిల్ 109 పరుగులతో ఆడుతున్నాడు. భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. క్రీజులో గిల్, రవీంద్ర జడేజా (39* పరుగులు)లు ఉన్నారు.