Ind vs Eng: ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు ఎవరు?

Published : Jul 02, 2025, 09:20 PM IST

India vs England Test: ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. రెండో టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. అయితే, ఇక్కడ సెంచరీలు సాధించిన భారత ప్లేయర్లు ఎవరో తెలుసా?

PREV
18
IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు బుధవారం (జూలై 2) ఇంగ్లాండ్ తో రెండో టెస్టు ఆడుతోంది. బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ సెంచరీని మిస్ అయ్యాడు. 

ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌లో ఇది రెండవ మ్యాచ్‌ కాగా, తొలి టెస్ట్‌ను లీడ్స్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ కోల్పోయింది. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

28
1. సచిన్ టెండూల్కర్

1996లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో భారత్ తరఫున ఒంటరిగా పోరాటం చేశాడు. 

రెండవ ఇన్నింగ్స్‌లో 122 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. కానీ ఈ ప్రదర్శన భారత్‌కు విజయం అందించలేకపోయింది. భారత్ ఆ మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో కోల్పోయింది.

38
2. విరాట్ కోహ్లీ

2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 149 పరుగులు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. మిగతా ప్లేయర్లు విఫలమైన ఈ వేదికపై ఇండియా ఇన్నింగ్స్‌కు ఆధారంగా నిలిచాడు.

కానీ, ఆ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోహ్లీ ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కూడా 51 పరుగులు చేసి మొత్తం 200 పరుగులు కొట్టాడు.

48
3. రిషభ్ పంత్

2022లో జరిగిన టెస్ట్ మ్యాచ్ (ఇది 2021 సిరీస్‌లో వాయిదా పడిన మ్యాచ్‌కి కొనసాగింపుగా నిర్వహించారు)లో రిషబ్ పంత్ 146 పరుగుల దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. 

ఆ ఇన్నింగ్స్‌ ద్వారా భారత్‌కు భారీ స్కోరు సాధించింది. అయితే, ఇంగ్లాండ్ 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్లతో విజయం సాధించింది.

58
4. రవీంద్ర జడేజా

రిషబ్ పంత్ తో పాటు అదే టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో మరో సెంచరీని నమోదు చేశాడు. జడ్డూ భాయ్ 194 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. కానీ అతనిసెంచరీ కూడా విజయాన్ని అందించలేకపోయింది. భారత్ ఆ మ్యాచ్‌లో కీలక సమయంలో పట్టు కోల్పోయి ఓడిపోయింది.

68
భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటి వరకు విజయం సాధించలేదు

భారత జట్టు ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఏ ఒక్కదానిలోనూ విజయం సాధించలేదు. 

7 టెస్టుల్లో భారత్ ఓడిపోయింది, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇది భారత జట్టు కలిసిరాని గ్రౌండ్ అని చెప్పొచ్చు.

78
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?

విరాట్ కోహ్లీనే భారత్ తరఫున ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కోహ్లీ రెండు మ్యాచ్‌ల్లో 231 పరుగులు చేశాడు. అతడి సగటు 57.75 కాగా, ఇందులో 149 పరుగుల ఓ అద్భుత ఇన్నింగ్స్ కూడా ఉంది.

భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ విషయానికి వస్తే చేతన్ శర్మ ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. అతను మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.

88
ఎడ్జ్‌బాస్టన్‌లో టాప్ స్కోరర్ ఎవరు?

ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 9 టెస్ట్ మ్యాచ్‌లలో 920 పరుగులు చేశాడు. అతడి సగటు 70.76 కాగా, అత్యధిక స్కోరు 142* పరుగులు (నాటౌట్).

ఎడ్జ్‌బాస్టన్‌లో టాప్ వికెట్ టేకర్ ఎవరు?

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అతను 14 మ్యాచ్‌లలో 52 వికెట్లు తీసాడు.

Read more Photos on
click me!

Recommended Stories