ఐ లవ్ యూ శుభ్‌మన్… లైవ్ మ్యాచ్‌లో గిల్‌కు లవ్ ప్రపోజల్‌.. ఎవరీ మిస్టరీ గర్ల్

Published : Oct 11, 2025, 06:01 PM IST

Shubman Gill: భారత్-వెస్టిండీస్ మధ్య ఢిల్లీ లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టాడు. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుండగా, ఐ లవ్ యూ శుభ్ మన్ అంటూ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఇప్పుడు ఈ ఘటన  వైరల్ గా మారింది.

PREV
15
లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్‌తో శుభ్‌మన్ గిల్ కు సర్ప్రైజ్

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఢిల్లీ లోని అరుణ్ జేట్లీ స్టేడియంలో మరోసారి అదరగొట్టాడు. భారత్–వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ లో తన అద్భుత ఫామ్ ను కొనసాగించాడు. రెండో రోజు గిల్ సెంచరీని సాధించాడు. ఈ సెంచరీ నడుమ ఆసక్తికర ఘటన జరిగింది. లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్‌తో శుభ్‌మన్ గిల్ కు సర్ప్రైజ్ ఇచ్చింది ఒక అమ్మాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

గిల్ సెంచరీ ఇన్నింగ్స్ మధ్యలో కెమెరా స్టాండ్ వైపు తిప్పగా, ఒక అమ్మాయి చేతిలో ఉన్న ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ప్లకార్డుపై స్పష్టంగా “I love you Shubman” అని రాసివుంది. దీన్ని చూసి ప్రేక్షకులతో స్టేడియం హోరెత్తింది. ఆ అమ్మాయి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. #ILoveYouShubman హ్యాష్‌ట్యాగ్‌తో వందలాది పోస్టులు, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ మిస్టరీ అమ్మాయి ఎవరో తెలియాల్సి ఉంది.

25
శుభ్ మన్ గిల్ సెంచరీ

భారత్, విండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు బాదారు. గిల్ 196 బంతుల్లో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. గిల్ కు ఇది తన టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీ. అలాగే, కెప్టెన్‌గా 5వ సెంచరీ కావడం విశేషం.

35
రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన గిల్

గిల్ తన సెంచరీ నాక్ తో భారత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ భారత కెప్టెన్‌గా 4 సెంచరీలు సాధించగా, గిల్ ఐదో సెంచరీతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇది గిల్‌కు కెప్టెన్‌గా కొత్త రికార్డు మాత్రమే కాకుండా, ఎం.ఎస్. ధోనీని కూడా సమం చేశాడు. ధోనీ తన కెప్టెన్సీ సమయంలో ఐదు సెంచరీలు సాధించాడు.

45
విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన గిల్

అలాగే, గిల్ ఒక క్యాలెండర్ సంవత్సరంలో భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. కోహ్లీ 2017, 2018లో ఐదేసి సెంచరీలు చేశాడు. గిల్ 2025లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది జూన్ లోనే గిల్ టెస్ట్ కెప్టెన్‌ అయ్యాడు. ఆయన నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది.

55
సచిన్ రికార్డ్ బద్దలుకొట్టి చరిత్ర సృష్టించిన శుభ్ మన్ గిల్

సచిన్ టెండూల్కర్ 1997లో సృష్టించిన రికార్డును కూడా గిల్ అధిగమించాడు. సచిన్ ఆ సంవత్సరం కెప్టెన్‌గా 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు సాధించాడు. అదే రికార్డును గిల్ 2025లో 12 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలతో బద్దలుకొట్టాడు. ఇది గిల్ కెరీర్‌లో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. కెప్టెన్‌గా ఇప్పటివరకు 7 టెస్ట్‌లలో 933 పరుగులు చేసి, 84.81 సగటుతో తన ఆటను కొనసాగిస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories