Shubman Gill: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్ పై అద్భుతమైన ఆటతో సెంచరీ కొట్టాడు. ఈ సెంచరీ నాక్ తో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే, ధోనీ రికార్డును సమం చేశాడు.
భారత్-వెస్టిండీస్ మధ్య ఢిల్లీ లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఆటతో ఆదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్ తో తన టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీని సాధించాడు. కెప్టెన్‌గా ఇది ఆయనకు 5వ సెంచరీ కావడం విశేషం. 129* పరుగుల సెంచరీ నాక్ లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టెస్ట్ కెప్టెన్‌గా మారిన తర్వాత గిల్ మరింత ప్రభావవంతమైన ఇన్నింగ్స్ లతో పరుగుల వరద పారిస్తున్నాడు.
గిల్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్ టూర్‌కు ముందు భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీని గిల్ కు అప్పగించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2–2తో డ్రా అయింది. అయినప్పటికీ గిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా ఆడాడు. సూపర్ ఫామ్ తో పరుగుల సునామీ రేపాడు.
25
కెప్టెన్‌గా గిల్ అద్భుత బ్యాటింగ్
గిల్ ఇప్పటివరకు కెప్టెన్‌గా 7 టెస్ట్ మ్యాచ్‌లలో 12 ఇన్నింగ్స్‌లు ఆడి, 84.81 సగటుతో 933 పరుగులు చేశాడు. వీటిలో ఒక డబుల్ సెంచరీ, ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇందులో అత్యధిక స్కోరు 269 పరుగులు. 2025 జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన బర్మింగ్హామ్ టెస్ట్‌లో ఈ పరుగులు సాధించాడు. ఈ ఏడాదిలోనే గిల్ 5 సెంచరీలు సాధించడం విశేషం. వెస్టిండీస్ పై సాధించిన సెంచరీతో గిల్ రెండు పెద్ద రికార్డులు సాధించాడు.
35
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన గిల్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1997లో కెప్టెన్‌గా 17 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు సాధించాడు. ఆ రికార్డును ఇప్పుడు గిల్ బద్దలుకొట్టాడు. కెప్టెన్‌గా ఆయన ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు సాధించాడు. ఇది కేవలం రికార్డ్ బద్దలుకొట్టడం మాత్రమే కాదు.. భారత టెస్ట్ కెప్టెన్‌గా కొత్త రికార్డుల మోత మోగిస్తున్నాడు. యంగ్ ఇండియాను ముందుకు నడిపిస్తున్నాడు.
గిల్ ఈ సెంచరీతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ కూడా తన టెస్ట్ కెప్టెన్ కెరీర్‌లో 5 సెంచరీలు సాధించాడు. ఈ ఘనతతో గిల్, ధోనీతో పాటు సౌరవ్ గాంగూలీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ లాంటి దిగ్గజాల సరసన చేరాడు.
ఇక కెప్టెన్‌గా గిల్ ఇప్పటికే రోహిత్ శర్మను కూడా వెనక్కి నెట్టాడు. రోహిత్ కెప్టెన్‌గా నాలుగు సెంచరీలు మాత్రమే సాధించగా, గిల్ ఐదు సాధించాడు.
55
భారత కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్లు