Bashir Ahmad: ఓ ఆటగాడు పాకిస్తాన్‌లో పుట్టి.. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడు. అక్కడ తాలిబాన్ల రాజ్యంలో తన సత్తా చాటాడు. అంతేకాదు జాతీయ జట్టులో చోటు సంపాదించింది. పాక్‌కు వ్యతిరేకంగా ఆడేందుకు సిద్దమయ్యాడు. అతడెవరో తెలుసా.?
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో పుట్టిన ఓ యువ ఆటగాడు.. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీ20లతో పాటు వన్డేలలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 20 ఏళ్ల ఈ ఆటగాడు మరెవరో కాదు.. బషీర్ అహ్మద్. డొమెస్టిక్ క్రికెట్‌లో తన సత్తా చాటుకుని.. జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.
25
జాతీయ జట్టుకు ఎంపిక
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న సిరీస్‌కు ఎంపికయ్యాడు. టీ20లతో పాటు వన్డే సిరీస్‌కు కూడా సెలెక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘన్‌కు వచ్చిన ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది.
35
చిన్నప్పటి నుంచి కలలు..
ఆఫ్ఘనిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన బషీర్ అహ్మద్.. 2005లో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెటర్ కావాలనే కలలు కన్నాడు. జూనియర్ సర్క్యూట్‌లో పాకిస్తాన్ తరపున ఆడాడు. ఆ సమయంలోనే అతడొక కీలక నిర్ణయం తీసుకున్నాడు.
నిజానికి, ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేతిలో బలూచిస్తాన్ ఆటగాళ్ళు వివక్షతను ఎదుర్కుంటున్నారు. అతడు 17 సంవత్సరాలు వయస్సు రాగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌కు వలస వెళ్లిపోయాడు. అక్కడ తన ప్రయాణాన్ని సరికొత్తగా ఆరంభించాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అతని ప్రతిభను గుర్తించి జాతీయ జట్టులో అతనికి స్థానం కల్పించింది.
55
ఆఫ్ఘనిస్తాన్ తరపునఎంట్రీ..
ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టులో సభ్యుడిగా మారిన బషీర్ అహ్మద్.. మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్‌లోనూ రాణించాడు. ఆ పెర్ఫార్మన్స్‌లు ఆధారంగా బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తరపున కేవలం ఒక్క టీ20ఐ మాత్రమే ఆడగా.. అందులో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. కానీ పొదుపైన బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. బషీర్ అహ్మద్ ఇప్పటివరకు 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 5 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతను ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 60 వికెట్లు, లిస్ట్-ఎలో 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే 20 T20 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు.