Most WTC Centuries: డ‌బ్ల్యూటీసీలో అత్యధిక సెంచ‌రీ కొట్టిన టాప్ 5 భార‌త ప్లేయ‌ర్లు

Published : Jul 29, 2025, 01:48 PM IST

Most WTC Centuries: వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన టాప్ 5 బ్యాటర్లలో రోహిత్ శర్మను శుభ్‌మన్ గిల్ స‌మం చేశాడు.

PREV
15
శుభ్‌మన్ గిల్‌ అరుదైన ఘనత

భారత యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో కొనసాగుతున్నాడు. అండర్సన్-టెండుల్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సెంచ‌రీలు బాదాడు. మాంచెస్టర్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో తన నాలుగో సెంచ‌రీని పూర్తి చేశాడు. ఇదివరకే వర్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిది సెంచ‌రీల‌తో ముందున్న కెప్టెన్ రోహిత్ శర్మను గిల్ ఇప్పుడు సమం చేశాడు. ఇద్దరూ ఒక్కొక్కరు తొమ్మిది సెంచ‌రీల‌తో భారత్ తరఫున వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (WTC) అత్యధి సెంచ‌రీలు సాధించిన బ్యాటర్లుగా నిలిచారు.

DID YOU KNOW ?
ఒక సిరీస్‌లో 4 సెంచ‌రీలు బాదిన మూడో బ్యాట‌ర్ గిల్
ఒకే టెస్ట్ సిరీస్‌లో 4 సెంచ‌రీలు సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా గిల్ ఘ‌న‌త సాధించాడు. అత‌ని కంటే ముందు సునీల్ గవాస్కర్ (రెండుసార్లు), విరాట్ కోహ్లీ మాత్రమే ఈ రికార్డు సాధించారు. అలాగే, కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.
25
WTC లో అత్య‌ధిక సెంచ‌రీలు - టాప్ 5 భారత బ్యాటర్లు

5. రవీంద్ర జడేజా & అజింక్యా రహానే 

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 43 ఇన్నింగ్స్‌లలో 3 సెంచ‌రీలు సాధించాడు. అలాగే, అజింక్యా రహానే 49 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచ‌రీల‌తో టాప్ 5 లో 5వ స్థానంలో ఉన్నారు.

4. మయాంక్ అగర్వాల్

త‌క్కువ అవకాశాలు ల‌భించిన‌ప్ప‌టికీ మయాంక్ అగర్వాల్ తన బ్యాటింగ్ క్లాస్‌ను చూపించాడు. అతను 19 టెస్టుల్లో 1293 పరుగులతో 4 సెంచ‌రీలు బాదాడు.

35
3. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్

ఈ లిస్టులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నారు. వీరు 5 సెంచ‌రీలు సాధించారు. కోహ్లీ ఇప్పటివరకు WTCలో 2617 పరుగులు చేశాడు. ఈ ముగ్గురిలో అతనే ముందు ఈ రికార్డు సాధించాడు.

45
2. రిషభ్ పంత్

వికెట్‌ కీపర్ బాట్స్‌మన్ రిషభ్ పంత్ టెస్ట్ ఫార్మాట్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్‌లలో 6 సెంచ‌రీలు చేశాడు. ప్రస్తుత సిరీస్‌లో ఇంగ్లండ్‌పై రెండు సెంచ‌రీలు బాదాడు.

1. రోహిత్ శర్మ, శుషుభ్‌మన్ గిల్

ప్రస్తుతం అత్యధిక సెంచ‌రీలు బాదిన ప్లేయ‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, గిల్ ఉన్నారు. రోహిత్ శర్మ (40 టెస్టులు), గిల్ (36 టెస్టుల్లో) ఈ ఘ‌న‌త సాధించారు. గిల్ తక్కువ మ్యాచ్‌లలోనే 9 సెంచరీల రికార్డు చేరుకోవడం విశేషం.

55
సూప‌ర్ ఫామ్ లో గిల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు 722 పరుగులు చేసి నాలుగు సెంచ‌రీలు సాధించాడు. మాంచెస్టర్ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచ‌రీ కొట్టాడు. ఇది అతని 9వ WTC సెంచ‌రీ కావ‌డం గమనార్హం.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాటర్లు సుదీర్ఘకాలంగా కీలకంగా రాణిస్తున్నారు. పంత్, కోహ్లీ, రోహిత్, గిల్ లాంటి బ్యాటర్లు రాణిస్తూ భారత్ విజయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కొత్త తరం బ్యాటర్లలో గిల్, జైస్వాల్ వంటి వారు ఈ జాబితాలో చేరడమూ భారత బ్యాటింగ్ భవిష్యత్తుకు నిదర్శనం.

Read more Photos on
click me!

Recommended Stories