రాహుల్-గిల్ మొదలు పెట్టారు.. జడేజా-సుందర్ ముగించారు
కేఎల్ రాహుల్ (90 పరుగులు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103 పరుగులతో ) మంచి బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (నాటౌట్ 101), జడేజా (నాటౌట్ 107) అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను డ్రాగా మలిచారు.
వీరిద్దరూ కలసి ఐదో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. జడేజా 13 ఫోర్లు, 1 సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. సుందర్ తన నాక్ లో 9 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.
మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ, ‘‘చివరి రోజు పిచ్‌లో ఆటకైనా, ఆటగాడికైనా పరీక్షే. ప్రెషర్ వల్లే మెరుగైన ప్రదర్శన వచ్చింది. ఒక్కో బంతికీ సిద్ధమవుతూ ఆటను ముందుకు తీసుకెళ్లాలని మా లక్ష్యం’’ అని తెలిపారు.
స్టోక్స్ నుంచి వచ్చిన డ్రా ఆఫర్‌ను తిరస్కరించిన విషయంపై మాట్లాడుతూ, ‘‘జడేజా, సుందర్ ఇద్దరూ 90కి పైగా స్కోరు చేశారు. వాళ్లు సెంచరీలను అందుకోవడం మా అందరికీ గౌరవం అనిపించింది’’ అని చెప్పారు.