India vs England: చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై గెలుస్తుందా? ఓవల్‌లో భారత్‌ గెలుపు అవకాశాలెంత?

Published : Jul 28, 2025, 04:19 PM IST

India vs England: కెనింగ్టన్ ఓవల్‌లో భారత్ ఇప్పటివరకు కేవలం 2 టెస్ట్‌లే గెలిచింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో చివరి మ్యాచ్ లో గెలిచి భారత్ సమం చేయాలని చూస్తోంది.  

PREV
15
కెనింగ్టన్ ఓవల్‌లో టెస్ట్ ఫైనల్‌కు రంగం సిద్ధం

ఇంగ్లాండ్, భారత్ ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. ఈ సిరీస్‌లో కీలకమైన చివరి టెస్టు మ్యాచ్ లండన్‌లోని ప్రముఖ కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. ఇక్కడ గెలిచి భారత్ సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది. అయితే, గత రికార్డుల ప్రకార.. ఈ మైదానంలో భారత్ కు అనుకూల ఫలితాలు పెద్దగా రాలేదు.

DID YOU KNOW ?
ఇంగ్లాండ్‌లో మూడే టెస్ట్ సిరీస్‌లు గెలిచిన భారత్
ఇంగ్లాండ్‌లో ఇండియా కేవలం మూడు టెస్ట్ సిరీస్‌లను మాత్రమే గెలుచుకుంది. 1971లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో ఇండియా 1-0తో (3 మ్యాచ్‌ల సిరీస్) గెలిచింది. ఇది ఇంగ్లాండ్‌లో ఇండియా సాధించిన మొదటి టెస్ట్ సిరీస్ విజయం. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇండియా 2-0తో (3 మ్యాచ్‌ల సిరీస్) గెలిచింది. 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఇండియా 1-0తో (3 మ్యాచ్‌ల సిరీస్) గెలిచింది.
25
కెనింగ్టన్ ఓవల్‌లో భారత్ రికార్డులు ఎలా ఉన్నాయి?

భారత్ ఇప్పటివరకు ఈ మైదానంలో 15 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించగలిగింది. ఆరు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిని ఎదుర్కొంది. మిగిలిన ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే ఇక్క‌డ భారత్ విజ‌యాలు అందుకోవ‌డం అంత ఈజీ కాదు. కానీ, భార‌త్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది కాబ‌ట్టి ఈ సారి న‌మ్మ‌కంతో బ‌రిలోకి దిగుతోంది.

35
కెనింగ్టన్ ఓవల్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు టీమిండియా

భారత్ తొలిసారి కెనింగ్టన్ ఓవల్‌లో ఆగస్ట్ 1936లో టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 1946, 1952లో ఆడిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఆ తర్వాత 1959లో భారత్ నాలుగో మ్యాచ్ ఆడింది. అప్పుడు కూడా 27 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

45
ఓవల్‌లో భార‌త జ‌ట్టు తొలి విజయం ఎప్పుడు?

1971 ఆగస్టులో భారత్ ఈ మైదానంలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. భారత్ ఈ మ్యాచ్‌ను నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాతి కాలంలో 1979, 1982, 1990, 2002, 2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ స‌మ‌యంలో భార‌త్ స్థిరమైన ప్రదర్శనల‌తో ఇంగ్లాండ్ కు బ‌ల‌మైన పోటీని ఇచ్చింది.

55
2011 నుంచి ఓవ‌ల్ లో భార‌త్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎలా ఉన్నాయి?

2011లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడింది. 2014లో కూడా భారత్ 244 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2018లో ఇంగ్లండ్ మరోసారి 118 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే 2021 సెప్టెంబరులో భారత్ 157 పరుగుల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇదే గ్రౌండ్ లో 2023 జూలైలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories