Shubman Gill: మ‌ళ్లీ దంచికొట్టిన శుభ్‌మన్ గిల్.. బ్రాడ్‌మన్, గవాస్కర్ రికార్డులు సమం

Published : Jul 27, 2025, 06:06 PM IST

Shubman Gill: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో శుభ్‌మన్ గిల్ అద్భుత‌మైన సెంచ‌రీ కొట్టాడు. అలాగే, డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గ‌వాస్క‌ర్ రికార్డును స‌మం చేశాడు.

PREV
16
మాంచెస్ట‌ర్ లో సెంచ‌రీ కొట్టిన శుభ్ మ‌న్ గిల్

మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచ‌రీ బాదాడు. గ‌త మూడు ఇన్నింగ్స్ ల‌లో నిరాశ‌ప‌రిచ్చిన అత‌ను.. ఈ సెంచ‌రీతో తిరిగి పరుగుల ట్రాక్‌లోకి వచ్చాడు. ఇది ఈ సిరీస్‌లో గిల్ కు నాలుగో సెంచ‌రీ కావడం విశేషం. దీంతో లెజెండ‌రీ ప్లేయ‌ర్లు డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్ ప్రపంచ రికార్డును గిల్ సమం చేశాడు.

26
సింగిల్ టెస్టు సిరీస్‌లో ఎక్కువ సెంచ‌రీలు కొట్టిన కెప్టెన్ గా శుభ్ మ‌న్ గిల్

భార‌త కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ప్ర‌స్తుతం టెస్టు సిరీస్ లో నాలుగు సెంచ‌రీలు బాదాడు. తన తొలి టెస్టు సిరీస్ కెప్టెన్‌గా నిర్వహిస్తూ నాలుగు సెంచ‌రీలు కొట్ట‌డం విశేషం. ఇది ఒకే టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా సాధించిన అత్యధిక సెంచ‌రీల రికార్డుగా నిలిచింది. ఇదే రికార్డును డాన్ బ్రాడ్‌మన్ (ఇండియాతో ఆస్ట్రేలియాలో), సునీల్ గవాస్కర్ (వెస్ట్ ఇండీస్‌తో భారతదేశంలో) నెలకొల్పారు.

36
ఒకే టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచ‌రీలు కొట్టిన కెప్టెన్లు వీరే
  • శుభ్‌మన్ గిల్: 4 vs ఇంగ్లాండ్ (ఇంగ్లాండ్‌లో)
  • డాన్ బ్రాడ్‌మన్: 4 vs ఇండియా (ఆస్ట్రేలియా‌లో)
  • సునీల్ గవాస్కర్: 4 vs వెస్ట్ ఇండీస్ (భారతదేశంలో)
46
డెబ్యూట్ టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టిన గిల్

శుభ్ మ‌న్ గిల్ టెస్టు కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో నాలుగు సెంచ‌రీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు మూడు సెంచ‌రీలు సాధించిన ఐదుగురు ఆటగాళ్ల సరసన గిల్ ఉండగా, మాంచెస్ట‌ర్ సెంచ‌రీతో వారిని అధిగమించాడు. వారిలో వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, బ్రాడ్‌మన్, గ్రెగ్ చాపెల్, విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్ ఉన్నారు.

56
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో గిల్-రాహుల్ రికార్డు భాగస్వామ్యం

రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయిన త‌ర్వాత శుభ్ మ‌న్ గిల్, కేఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం అందించారు. నాలుగో రోజు తొలి సెషన్‌లో కొత్త బంతిని జాగ్రత్తగా ఆడిన తర్వాత, చివరి సెషన్‌లో బంతి మృదువయ్యాక దూకుడుగా ఆడారు.

66
కేఎల్ రాహుల్ సెంచ‌రీ మిస్

ఐదో రోజు వాతావరణం మేఘావృతంగా ఉండడంతో ఇంగ్లాండ్ బౌలర్లు స్వల్ప స్వింగ్ ల‌భించింది. దీనిని ఆ జ‌ట్టు బౌల‌ర్లు సద్వినియోగం చేసుకున్నారు. నాలుగో రోజు బౌలింగ్ చేయని బెన్ స్టోక్స్, చివ‌రి రోజు రెండో ఓవర్లో బౌలింగ్ ప్రారంభించి ఎనిమిది ఓవర్లు నిరంతరాయంగా వేసి, కేఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు. 90 పరుగుల వద్ద రాహుల్ ఔటవడంతో సెంచ‌రీ మిస్ అయ్యాడు. స్టోక్స్ భుజం నొప్పితో ఇబ్బంది పడ్డా బౌలింగ్ కొనసాగించడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories