లగ్జరీ కార్లు, ప్రీమియం ఫ్లాట్.. శ్రేయాస్ అయ్యర్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?

Published : Aug 21, 2025, 06:09 PM IST

Shreyas Iyer Net Worth: టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ సాలరీ, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌లు, బీసీసీఐ కాంట్రాక్టులతో భారీగానే సంపాదిస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంగా అయ్యర్ నెట్‌వర్త్ ఎంత? 

PREV
15
శ్రేయాస్ అయ్యర్ కు ఐపీఎల్ నుంచి భారీ ఆదాయం

భారత క్రికెట్ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున 2.6 కోట్లు రూపాయల కాంట్రాక్ట్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టారు.

2018లో అయ్యర్ ఐపీఎల్ జీతం 7 కోట్లకు పెరిగింది. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 12.25 కోట్లతో తమ జట్టులోకి తీసుకున్నారు. 2025లో పంజాబ్ కింగ్స్ 26.75 కోట్ల భారీ మొత్తం వెచ్చించి ఆయనను తమ జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచారు.

DID YOU KNOW ?
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ రికార్డులు
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. మూడు జట్లను ఫైనల్ కు తీసుకెళ్లాడు. కోల్ కతాకు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు.
25
శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు

శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐలో గ్రేడ్-బి కాంట్రాక్ట్‌లో ఉన్నారు. 2024 వరకు ఆయనకు సంవత్సరానికి 3 కోట్లు రూపాయల కాంట్రాక్ట్ లభించింది. అయితే ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ కోల్పోవడం వంటి కారణాలతో మార్చి 2024లో ఆయనను సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుండి తొలగించారు. అయినప్పటికీ ఐపీఎల్ జీతాలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల ద్వారా ఆయన ఆదాయం భారీగానే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఫీజులు, దేశీయ క్రికెట్ వేతనాలు కూడా ఆయన సంపాదనలో భాగం అయ్యాయి.

35
శ్రేయాస్ అయ్యర్ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌లు

శ్రేయస్ అయ్యర్ అనేక ప్రధాన బ్రాండ్లకు అంబాసడర్‌గా ఉన్నారు. వాటిలో బోట్, డ్రీమ్11, గూగుల్ పిక్సెల్, మాన్యవర్, ఫ్రెస్కా, సిఏటి, మైప్రోటీన్ ఉన్నాయి. ఒక్కో బ్రాండ్ నుంచి ఆయనకు 25 నుంచి 30 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. వార్షికంగా 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఆయన ఈ ఎండోర్స్‌మెంట్‌ల ద్వారానే సంపాదిస్తున్నారు.

45
శ్రేయాస్ అయ్యర్ లగ్జరీ అపార్ట్‌మెంట్, సూపర్ కార్ కలెక్షన్

ముంబైలోని లోధా వరల్డ్ టవర్స్‌లో శ్రేయస్ అయ్యర్‌కు 4 బిహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఉంది. ఈ ప్రీమియం ఫ్లాట్ మార్కెట్ ధర సుమారు 11.8 కోట్లు. ఇది ముంబైలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 

కార్ల విషయానికి వస్తే, శ్రేయాస్ అయ్యర్ గ్యారేజీలో లాంబోర్గిని హురాకాన్, మెర్సిడెస్-బెంజ్ G63 AMG, ఆడి S5, బీఎండబ్ల్యూ మోడల్స్ ఉన్నాయి. ఈ సూపర్ కార్ల విలువ కోట్లలో ఉంటుంది.

55
శ్రేయాస్ అయ్యర్ నెట్‌వర్త్

2025 నాటికి శ్రేయాస్ అయ్యర్ నెట్‌వర్త్ సుమారు 60 నుంచి 65 కోట్ల రూపాయలుగా అంచనా. ఐపీఎల్ సాలరీలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌లు, బీసీసీఐ మ్యాచ్ ఫీజులు ఆయన సంపాదనకు ముఖ్య వనరులుగా ఉన్నాయి. 2015లో శ్రేయాస్ అయ్యర్ సంపాదన 7 కోట్లు ఉండగా, 2018లో 20 కోట్లకు చేరింది. 2022లో 45 కోట్లకు పెరిగి, 2025లో పంజాబ్ కింగ్స్ 26.75 కోట్ల కాంట్రాక్ట్ కారణంగా 65 కోట్లకు చేరింది.

Read more Photos on
click me!

Recommended Stories