Dhanashree on Chahal: భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకుల రోజు ధరించిన 'షుగర్ డాడీ' టీషర్ట్‌పై తొలిసారి ధనశ్రీ వర్మ స్పందించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.
యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ: పెళ్లి నుంచి విడాకుల వరకు
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, డాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మలు కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో దగ్గరయ్యారు. కొన్ని రోజుల ప్రేమాయణం తర్వాత 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, వారి బంధంలో విభేదాలు తలెత్తడంతో 18 నెలల పాటు ఇద్దరూ విడిగా జీవించారు. చివరకు 2025 మార్చి 20న బాంద్రా ఫ్యామిలీ కోర్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
DID YOU KNOW ?
యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ రికార్డు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్.2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఒక మ్యాచ్‌లో హ్యాట్రిక్, ఐదు వికెట్లు తీశారు.
25
హాట్ టాపిక్ గా చాహల్ టీషర్ట్
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల మధ్య విడాకులు జరిగి కొన్ని నెలలు గడిచాయి. అయితే, విడాకుల రోజు చాహల్ ధరించిన టీషర్ట్ అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. కోర్టుకు హాజరైన సమయంలో యుజ్వేంద్ర చాహల్ నల్లటి రంగు టీషర్ట్ ధరించారు.
ఆ టీషర్ట్‌పై “Be Your Own Sugar Daddy” అని ఉండటంతో అది వెంటనే మీడియా, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై చాలా రకాల చర్చలు కూడా సాగాయి.
35
ధనశ్రీ వర్మపై నెటిజన్ల విమర్శలు
చాహల్ ఈ టీషర్ట్ ధరించి కోర్టుకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొంతమంది నెటిజన్లు చాహల్ తన మాజీ భార్య ధనశ్రీని కించపరచే ఉద్దేశంతో ఈ వాక్యం ఉన్న టీషర్ట్ వేసుకున్నారని ఆరోపించారు.
అలాగే, చాహల్ ఈ రకమైన టీషర్ట్ వేసుకొని రావడంతో మరికొంత మంది నెటిజన్లు ధనశ్రీ చాహల్‌ను మోసం చేశారని ఆరోపించారు. ఈ విమర్శల మధ్య ఆమె మాత్రం ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే, తాజగా ఈ విషయంపై ధనశ్రీ స్పందించారు.
మొదటిసారి ఈ వివాదంపై ధనశ్రీ వర్మ స్పందించారు. “అతను ముందుగా కోర్టు నుంచి బయటికి వెళ్లిపోయారు. నేను కోర్టు లోపలే ఉన్నాను. అందువల్ల అతను ఏ టీషర్ట్ వేసుకున్నారో నాకు తెలియదు” అని చెప్పారు. అలాగే, “ఎవరైనా అలాంటి సందేశం ఇవ్వాలనుకుంటే వాట్సాప్‌లో కూడా పంపవచ్చు. కానీ టీషర్ట్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఏముంది” అని ప్రశ్నించారు.
55
విడాకులు సమయంలోని బాధకర క్షణాలను గుర్తుచేసుకున్న ధనశ్రీ
కోర్టు చివరి తీర్పు చెప్పిన సమయంలో తాను మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ కాసేపు భావోద్వేగానికి లోనయ్యానని ధనశ్రీ తెలిపారు. “కోర్టులో విడాకులపై తుది తీర్పు వచ్చేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. అందరి ముందు వెక్కివెక్కి ఏడ్చాను. నేను ఏడుస్తున్నప్పటికీ చాహల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ క్షణం చాలా బాధాకరంగా అనిపించింది” అని అన్నారు.
ఆ తర్వాత మీడియాను ఎదుర్కొవడం ఇష్టం లేక కోర్టు వెనుక డోర్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో తాను సాధారణ జీన్స్, షర్ట్ వేసుకుని వచ్చానని ధనశ్రీ వర్మ చెప్పారు.