Team India: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్ కు గుడ్ న్యూస్ !

Published : Jul 11, 2025, 05:18 PM IST

Team India: రాబోయే వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ విషయంలో బీసీసీఐ సంచలనం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. రోహిత్ శర్మ కు బిగ్ షాక్ తగలనుందనీ, శుభ్‌మన్ గిల్ మాత్రం గుడ్ న్యూస్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

PREV
16
భారత క్రికెట్‌లో కీలక మార్పులు

భారత క్రికెట్‌ లో తాజాగా ఒక నివేదికగా సంచలనంగా మారింది. భారత జట్టులో త్వరలోనే కీలక మార్పులు ఉంటాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

సంబంధిత నివేదికల ప్రకారం.. టెస్టు, టీ20 క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.

అయితే, వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ స్థానాన్ని శుభ్‌మన్ గిల్ భర్తీ చేయనున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. "స్పోర్ట్స్ తక్" ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సమాచారం ప్రకారం, వచ్చే వన్డే సిరీస్‌లో గిల్ భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

26
రోహిత్ శర్మకు షాక్.. శుభ్‌మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ

సంబంధిత నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని నాయకత్వ మార్పుపై దృష్టి పెట్టింది.

ఈ మార్పులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు గిల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదే గిల్‌కు ఫుల్‌టైం వన్డే కెప్టెన్‌గా మొదటి సిరీస్ కావచ్చు. ఇదే జరిగితే రోహిత్ శర్మకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు.

36
రోహిత్ శర్మ భవిష్యత్తుపై సందేహాలు

ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఈ నివేదికలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ ఫామ్ తగ్గడంతో, 2024 డిసెంబర్‌లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్‌లో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

ఆ తర్వాత 2025లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, వన్డేలు ఆడతానని చెప్పాడు. 2027 వరల్డ్ కప్‌లో జట్టును ముందుండి నడిపించాలనే కోరికను రోహిత్ స్పష్టంగా చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను గెలిపించిన రోహిత్, భారత్‌లో అత్యంత విజయవంతమైన వైట్ బాల్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

46
శుభ్‌మన్ గిల్ దూకుడు

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 500కి పైగా పరుగులు సాధించిన గిల్, సెంచరీ, డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్సీలోనూ నిరూపించుకుంటున్నాడు. 

దీంతో వన్డేల్లో కూడా అద్భుత ప్రదర్శనలు చూపించిన గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడంతో మంచి ఫలితాలు ఉంటాయని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, వరల్డ్ కప్‌కు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో, రోహిత్‌ను ఇప్పుడే తప్పించడం తొందరపాటు అవుతుందనే ప్రశ్నలు కూడా కొత్త చర్చకు తెరలేపాయి.

56
వైరల్ పోస్ట్‌ లతో సంచలనం

ఒక ప్రముఖ జర్నలిస్టు చేసిన X పోస్ట్ ప్రకారం, వచ్చే వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉంటాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో, అభిమానుల్లో, క్రికెట్ విశ్లేషకులలో వాగ్వాదం మొదలైంది. కొంతమంది గిల్ నాయకత్వాన్ని సమర్థిస్తుండగా, మరికొంతమంది రోహిత్‌కు ఇంకా సమయం ఇవ్వాలంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.

66
రోహిత్, కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లోకి ఎప్పుడొస్తారు?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ద్వారా తిరిగొస్తారని సమాచారం ఉంది. కానీ, తాజాగా బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పరస్పర ఒప్పందంతో ఈ సిరీస్‌ను 2026కి వాయిదా వేశాయి. ప్రస్తుతం వీరిద్దరూ నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగబోయే వైట్ బాల్ సిరీస్‌లో పాల్గొననున్నారు.

వరల్డ్ కప్ 2027 సమీపిస్తున్న కొద్దీ, ఫిట్‌నెస్, ఫామ్ కీలక అంశాలవుతాయి. అందువల్ల రోహిత్, కోహ్లీ స్క్వాడ్‌లో ఆటోమేటిక్ ఎంపికలు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ మార్పులు అధికారికంగా ప్రకటించిన తర్వాత స్పష్టత రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories