Duke’s Ball: బ్యాట్‌లు విరిగిపోతాయ్.. అయినా ఇంగ్లాండ్ ఈ బంతులనే ఎందుకు వాడుతోంది? అసలు ఏంటి ఈ డ్యూక్స్‌?

Published : Jul 10, 2025, 11:19 PM IST

Duke’s Ball: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో డ్యూక్స్ బంతులు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లాండ్ కు చాలా కాలంగా బలమైన ఆయుధంగా ఉన్న ఈ డ్యూక్స్ ఇప్పుడు త్వరగా రూపు మారుతూ మృదువవుతోందన్న విమర్శలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఏంటి ఈ డ్యూక్స్?

PREV
15
ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్‌లో నమ్మిన ఆయుధం డ్యూక్స్

Duke’s Ball: ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో ఉపయోగిస్తున్న డ్యూక్ బంతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్‌లో నమ్మిన ఆయుధం డ్యూక్స్ కొనసాగుతోంది.

అయితే, భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తాజాగా డ్యూక్స్ బాల్ చాలా త్వరగా రంగుతో పాటు రూపు మారుతోందనీ, మృదువవుతోందని విమర్శించారు. ఈ బాల్ చాలా త్వరగా బ్యాటర్లకు అనుకూలంగా మారుతోందనే వివర్శలు కూడా ఉన్నాయి. 

"బంతి త్వరగా షేప్ కోల్పోవడం వల్ల, బౌలర్లు సమర్థవంతంగా ఉపయోగించలేకపోతున్నారు. ఇది బౌలర్లకు చాలా కష్టంగా ఉంటుంది" అని గిల్ వ్యాఖ్యానించారు. అలాగే, రిషబ్ పంత్ సైతం డ్యూక్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

25
డ్యూక్స్ బాల్ అంటే ఏమిటి?

డ్యూక్స్ బాల్ అనేది ఇంగ్లాండ్‌లో తయారు చేసిన ఒక ప్రత్యేక క్రికెట్ బంతి. ఇది చాలా స్పష్టమైన సీమ్ ను కలిగి ఉంటుంది. అంటే బంతిపై పైకి పెరిగిన కుట్లు ఉంటాయి. దీంతో బంతిని పట్టుకోవడంలో బౌలర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

స్వింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. అంటే బౌలింగ్ చేసినప్పుడు గాలిలో అనూహ్యంగా కదులుతుంది. ఈ స్వింగ్ బ్యాటర్లకు బంతి ఎక్కడికి వెళుతుందో అంచనా వేయడం కష్టంగా ఉంటుంది.

డ్యూక్ బంతి కూకబుర్రా (ఆస్ట్రేలియాలో ఉపయోగించేది) లేదా SG బంతి (భారతదేశంలో ఉపయోగించేది) వంటి ఇతర బంతులతో పోలిస్తే ముదురు రంగులో ఉంటుంది. ఇది చేతితో తయారు చేస్తారు. అంటే శ్రద్ధతో జాగ్రత్తగా చాలా కాలంగా మన్నికగా ఉండేదిగా తయారు చేస్తారు.

దీంతో మ్యాచ్ సమయంలో దాని ఆకారం మారకుండా ఎక్కువసేపు ఉంటుంది. డ్యూక్స్ బంతి అధికంగా స్వింగ్ ఇవ్వగల సామర్థ్యంతో ఉండడం వల్ల ఇంగ్లాండ్ పిచ్‌లకు ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది.

35
ఇంగ్లాండ్ డ్యూక్స్ బంతులనే ఎందుకు ఇష్టపడుతుంది?

ఇంగ్లాండ్ వాతావరణం, ఆట పరిస్థితులు భారతదేశం లేదా ఆస్ట్రేలియా వంటి దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. చల్లని ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, ఇంగ్లాండ్‌లోని పిచ్‌లు అన్నీ డ్యూక్ బంతిని బాగా స్వింగ్ చేయడానికి సహాయపడతాయి. 

బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి స్వింగ్‌ను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన ఇంగ్లీష్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి ప్రసిద్ధ ఇంగ్లీష్ బౌలర్లు డ్యూక్ బంతిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు. విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకున్నారు. ఇది వారి బౌలింగ్ శైలికి, పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది.

డ్యూక్ బంతికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని 1760 నుండి ఇంగ్లాండ్‌లోని టాన్‌బ్రిడ్జ్‌లో తయారు చేస్తున్నారు. ఇది ఇప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్ లలో వాడుకలో ఉన్న పురాతన క్రికెట్ బంతి. అన్ని రకాల క్రికెట్‌లలో డ్యూక్ బంతిని ఉపయోగించే రెండు జట్లు ఇంగ్లాండ్, వెస్టిండీస్ మాత్రమే.

45
డ్యూక్స్: ఇప్పుడు సమస్య ఎందుకొచ్చింది?

ప్రస్తుత ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా, రెండు జట్ల ఆటగాళ్లు డ్యూక్ బంతి చాలా త్వరగా మృదువుగా మారుతోందని పేర్కొంటున్నారు. ఆట కొనసాగుతున్న కొద్దీ దాని ప్రభావం తగ్గుతుందని ఫిర్యాదు చేశారు. 

బంతి రూపును కోల్పోయి మృదువుగా మారినప్పుడు లేదా దాని ఆకారం కోల్పోయినప్పుడు, అది స్వింగ్ అవ్వడం ఆగిపోతుంది. బౌలర్లకు బాల్ ను పట్టుకోవడంలో కూడా కాస్త కష్టంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.

55
డ్యూక్స్ త్వరగా రంగును, రూపును కోల్పోతోందన్న రిషబ్ పంత్

డ్యూక్ బంతి త్వరగా రంగును కోల్పోతున్నదని రిషబ్ పంత్ అన్నారు. అలాగే, దాని ఆకారాన్ని కోల్పోవడం నిరాశపరిచిందని చెప్పారు. ఇది బౌలర్లకు కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. 

ఆటపై ప్రభావం చూపుతోందని తెలిపారు. అయితే, డ్యూక్ బంతుల తయారీదారు బంతి నాణ్యతను సమర్థించుకున్నాడు, ఇది చాలా కాలం పాటు ఉండేలా తయారు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, ప్రతి దేశం వారి ఆట పరిస్థితులకు, సంప్రదాయాలకు బాగా సరిపోయే బంతిని ఎంచుకుంటుంది. ఇంగ్లాండ్ డ్యూక్ బంతిని ఎంచుకుంటుంది. ఎందుకంటే ఇది వారి పరిస్థితులలో బ్యాట్, బంతి మధ్య పోటీని ప్రోత్సహిస్తుంది. ఇది ఆటగాళ్లకు, అభిమానులకు టెస్ట్ క్రికెట్‌ మజాను పంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories