Lords Test: లార్డ్స్‌లో కేవలం 38 పరుగులకే ఆలౌట్‌.. చెత్త టెస్ట్ రికార్డు సాధించిన జట్టు

Published : Jul 10, 2025, 11:59 PM IST

Lords Test: లండన్ లోని లార్డ్స్‌ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టులో తలపడుతున్నాయి. మొదటి రోజు ఇంగ్లాండ్ స్లోగా బ్యాటింగ్ చేసింది. అయితే, లార్డ్స్ టెస్టు రికార్డులు గమనిస్తే.. ఇక్కడ ఒక జట్టు కేవలం 38 పరుగులకే ఆలౌట్ అయింది. 

PREV
15
లార్డ్స్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌ మ్యాచ్

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మూడవ మ్యాచ్ గురువారం (జూలై 10) నుంచి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌లోని ఈ చారిత్రాత్మక గ్రౌండ్ ప్రతి క్రికెటర్‌కు కలల వేదికగా ఉంది.

ఇక్కడ క్రికెటర్లు గొప్ప రికార్డులు సృష్టించాలనే తపనతో ఉంటారు. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సిరీస్ లో 2-1 ఆధిక్యం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ ఈ మైదానంలో క్రికెట్ చరిత్రలో కొన్ని అసాధారణ ఘటనలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఒక జట్టు 38 పరుగులకే ఆలౌట్ కావడం.. ఇది టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త స్కోర్లలో ఒకటిగా నిలిచింది.

25
లార్డ్స్‌లో అత్యధిక, అత్యల్ప స్కోర్ సాధించిన జట్లు ఏవి?

లార్డ్స్ మైదానంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. కంగారు జట్టు 1930లో ఇక్కడ 729/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 

లార్డ్స్ మైదానంలో అత్యల్ప స్కోరు రికార్డు మాత్రం ఐర్లాండ్ పేరిట ఉంది. 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 38 పరుగులకే ఆలౌట్ అయింది.

35
2019లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో అత్యల్ప స్కోరు నమోదు

ఈ టెస్ట్ మ్యాచ్ 2019లో జూలై 24 నుంచి 26 వరకు జరిగింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో టిమ్ ముర్టాగ్ ఐదు వికెట్లు తీయగా, మార్క్ అడేర్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లాండ్ పునరాగమనంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఐర్లాండ్ బలమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 207 పరుగులు చేసి 122 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. 

బ్యాట్స్‌మన్ బాల్బెర్నీ 69 బంతుల్లో 55 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తన తప్పులను సరిదిద్దుకొని 303 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ లీచ్ 92 పరుగులు చేయగా, జేసన్ రాయ్ 72 పరుగులు సాధించాడు.

45
ఐర్లాండ్ వైపే గెలుపు అవకాశాలు

ఇంగ్లాండ్ 303 పరుగులు చేయడంతో ఐర్లాండ్ ముందు టార్గెట్ కేవలం 182 పరుగులుగా ఉంది. దీంతో మ్యాచ్ ను విజయవంతంగా ఐర్లాండ్ గెలుచుకుంటుందని అభిమానులు భావించారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఐర్లాండ్ నిలవలేకపోయింది.

55
లార్డ్స్ లో కేవలం 38 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్

ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను తీవ్ర నిరాశ కలిగించే విధంగా 38 పరుగులకే ఆలౌట్ అయింది. 15.4 ఓవర్లపాటు మాత్రమే ఇన్నింగ్స్ సాగింది. జేమ్స్ మెకల్లమ్ 11 పరుగులు చేసి జట్టులో ఏకైక డబుల్ డిజిట్ స్కోరర్‌గా నిలిచాడు. 

క్రిస్ వోక్స్ ఈ ఇన్నింగ్స్‌లో 7.4 ఓవర్లలో 17 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసాడు. స్టూవర్ట్ బ్రాడ్ ఎనిమిది ఓవర్లలో 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

ఇది క్రికెట్ చరిత్రలో ఒక చెత్త అధ్యాయంగా నిలిచిపోయింది. ఐర్లాండ్ టీమ్, లార్డ్స్ మైదానంలో అత్యల్ప స్కోరుతో టెస్ట్ క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించింది.

Read more Photos on
click me!

Recommended Stories