Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ముందు రాజస్థాన్ రాయల్స్‌లో భారీ మార్పులు జరగనున్నాయని సమాచారం. సంజూ శాంసన్ తో పాటు మరో ఐదుగురు ఆటగాళ్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2025 సీజన్ రాజస్థాన్ రాయల్స్ (RR)కి పూర్తిగా నిరాశ కలిగించేలా ముగిసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన జట్టు.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ ఫలితంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే గత సీజన్ చెత్త ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని పెద్ద మార్పులకు జట్టు సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు కీలక ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వారిలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు గమనిస్తే..
DID YOU KNOW ?
ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ 2008లో తమ ఏకైక ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. కెప్టెన్ షేన్ వార్న్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. యూసుఫ్ పఠాన్ అద్భుతంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
26
సంజూ శాంసన్ రాజస్థాన్ ను వీడతారా?
కెప్టెన్ సంజూ శాంసన్ జట్టును వీడటం గురించి ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కి తన నిర్ణయాన్ని తెలియజేసిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ESPN క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్ (IPL) 2025 ముగిసిన వెంటనే సంజూ శాంసన్ తనను వేలానికి ముందు రిలీజ్ చేయాలని లేదా ట్రేడ్ చేయాలని కోరారు. రాజస్థాన్‌తో ఆయన సంబంధాలు గతంలా లేవని సమాచారం. అందుకే జట్టును వీడాలని సంజూ శాంసన్ చూస్తున్నారని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
36
తుషార్ దేశ్‌పాండే
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 6.50 కోట్లకు తుషార్ దేశ్‌పాండేను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. అయితే, ఆయన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మాత్రమే తీశారు. ఎకానమీ రేట్ 10.62గా ఉండటం బౌలింగ్ విభాగంలో ఆందోళన కలిగించింది. అతను తన ఐపీఎల్ కెరీర్‌లో 46 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు మాత్రమే సాధించారు.
ఐపీఎల్ 2025కు ముందు రూ. 11 కోట్లకు రిటైన్ చేసిన షిమ్రాన్ హెట్మెయర్ కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలమయ్యారు. 14 మ్యాచ్‌ల్లో 239 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 21.72, స్ట్రైక్ రేట్ 145.73తో తన బ్యాటింగ్ ను కొనసాగించాడు. పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్న ఈ ప్లేయర్ నుంచి దానికి తగ్గట్టు ప్రదర్శన లేకపోవడంతో రాజస్థాన్ జట్టు అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
56
వనిందు హసరంగ
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు అతని నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శనలు రాలేదు. 11 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు మాత్రమే సాధించగా, ఎకానమీ రేట్ 9.04గా ఉంది. జట్టు ఆయనను వేలానికి ముందు రిలీజ్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
66
ఫజల్హాక్ ఫారూఖీ
ఆఫ్గాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫారూఖీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది రాజ స్థాన్ రాయల్స్. ఆయన 5 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. ఈ కారణంగా ఆయనను జట్టు నుంచి తప్పించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.