Rohit Sharma: శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నారు. ఆసియా కప్ 2025లో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. రోహిత్ శర్మ తర్వాత 2027 వన్డే వరల్డ్ కప్ కు గిల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా మారవచ్చు.
రోహిత్ తర్వాత భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా గిల్?
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శుభ్‌మన్ గిల్, త్వరలోనే వన్డే ఫార్మాట్‌లో కూడా కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని తాజా మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ స్థానంలో గిల్ టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త క్రికెట్ సర్కిల్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
DID YOU KNOW ?
వన్డేల్లో 32 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఇప్పటివరకు 273 వన్డే మ్యాచ్ లను ఆడి 11168 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు. 3 డబుల్ సెంచరీలు, 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు 344 సిక్సర్లు బాదాడు.
25
ఆసియా కప్ 2025 లో భారత జట్టుకు వైస్ కెప్టెన్ గిల్?
ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ కెప్టెన్‌గా విజయవంతమైన గిల్.. ఈ ఏడాది సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం టీ20 జట్టులో వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశముంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్‌కి ఫిట్ అవుతారని, ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. గిల్‌ను ఆయన డిప్యూటీగా నియమించే అవకాశం ఉందని సమాచారం.
35
గిల్ టీ20లో చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడాడు?
గిల్ చివరిసారిగా జూలై 2024లో భారత తరఫున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు. తరువాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై జరిగిన హోం టెస్ట్ సిరీస్‌ల్లో బిజీగా ఉన్నారు. టెస్ట్ క్రికెట్‌కి ప్రాధాన్యతనిస్తూ ఆయనను టీ20 జట్టులో ఎంపిక చేయలేదు. ఇప్పుడు మళ్లీ టీ20 జట్టులో చోటుదక్కించేకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆయన ఓపెనింగ్ చేస్తారా, లేక మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
గిల్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రోహిత్ శర్మ ప్రస్తుత వన్డే కెప్టెన్ అయినప్పటికీ, ఆయన ఇప్పుడు కేవలం ఒకే ఫార్మాట్ పరిమితం అయ్యారు. టీ20, టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికారు. వన్డేలు, ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నారు. దీంతో భవిష్యత్తులో గిల్‌కు పూర్తిస్థాయి వన్డే కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2027 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుండగా, అప్పటికి గిల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
55
రోహిత్ శర్మకు బిగ్ షాక్
సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు భారత జట్టు చోటుదక్కకపోవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాబోయే వరల్డ్ కప్ కోసం భారత జట్టులో వీరి స్థానంలో యంగ్ ప్లేయర్లను సిద్ధం చేసే పనిలో బీసీసీఐ ఉందని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఐపీఎల్ తర్వాత రోహిత్ శర్మ అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్‌ల్లో ఆడనున్నారు. ఈ సిరీస్‌లో ఆయన వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తారు. అయితే గిల్‌ను కెప్టెన్‌గా నియమించే నిర్ణయం వెంటనే అమలు అవుతుందా, లేక కొంత సమయం పడుతుందా అన్నది త్వరలోనే తెలిసే అవకాశముంది.