మ్యాచ్ చివరి ఓవర్‌లో భారత్‌కు 10 పరుగులు కావాల్సి ఉంది. తిలక్ రెండో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి ఒక రన్ అవసరం కాగా రింకూ సింగ్ స్ట్రైక్‌కి వచ్చాడు. హారిస్ రౌఫ్ వేసిన బంతిని రింకూ బౌండరీకి పంపించి భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఛాంపియన్ గా నిలిపాడు.
మ్యాచ్ తరువాత రింకూ సింగూ మాట్లాడుతూ – “నా కోసం ఆ ఒక్క బంతే ముఖ్యం. ఒక రన్ కావాలి, నేను బౌండరీ కొట్టాను. జట్టు గెలిచింది. నేను ఫినిషర్‌ని అని అందరికీ తెలుసు. ఈ క్షణం చాలా ప్రత్యేకం” అని అన్నారు.
నిజమైన రింకూ భవిష్యవాణి
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రింకూ సింగ్ సెప్టెంబర్ 6న ఒక నోట్ పై తాను విన్నింగ్ పరుగులు కొడతానని రాసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. నిజంగానే ఆయన రాసినట్లు జరిగింది. చివరికి ఒక్క బంతిని ఆడి విన్నింగ్ పరుగులతో రింకూ సింగ్ ఆ మాటను నిజం చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2025లో భారత్ 9వసారి ట్రోఫీ గెలుచుకుంది. తిలక్ వర్మ మ్యాచ్ హీరోగా నిలిచినా, రింకూ సింగ్ ఒక్క బంతితో అభిమానుల హృదయాలను గెలిచాడు.