IND vs PAK ఫైనల్‌లో భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కూల్చారు. తక్కువ స్కోర్ తో మ్యాచ్ ను భారత నియంత్రణలోకి తీసుకొచ్చారు. తొలి వికెట్ కోసం సాధారణంగా కొంచెం ఇబ్బంది పడ్డా, తర్వాత స్పిన్నర్ల సరసన బుమ్రా, కుల్దీప్, అక్షర్, చక్రవర్తిలు సూపర్ కమ్ బ్యాక్ తో పాక్ ను దెబ్బకొట్టారు.
147 పరుగుల టార్గెట్ భారత్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. సంజూ శాంసన్ 24 పరుగుల నాక్ ఆడాడు. శివమ్ దూబే కూడా కీలకమైన 33 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
తిలక్ వర్మ హాఫ్ సెంచరీ నాక్ తో చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. ఆసియా కప్ 2025 ఛాంపియన్ గా భారత్ ను నిలబెట్టాడు. భారత్ చివరి ఓవర్ వరకు ఆడి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. తిలక్ వర్మ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు.