RCB: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత అత్యధిక బ్రాండ్ విలువను సాధించింది. ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను అధిగమించి తొలి స్థానంలోకి చేరింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో, లీగ్ మొత్తం వ్యాపార విలువ 12.9% వృద్ధితో $18.5 బిలియన్లకు చేరుకుంది. అంతేకాకుండా, స్వతంత్ర బ్రాండ్ విలువ 13.8% పెరిగి $3.9 బిలియన్లకు చేరిందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హూలిహాన్ లోకీ (Houlihan Lokey) తాజా నివేదిక తెలిపింది. రికార్డ్ స్థాయిలో వ్యూయర్‌షిప్, ప్రకటనల ఆదాయ వృద్ధి ఇందుకు కారణాలుగా పేర్కొంది.
26
సీఎస్‌కేను అధిగమించిన ఆర్సీబీ
ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను 2025లో గెలుచుకుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను అధిగమించి అత్యధిక బ్రాండ్ విలువ గల జట్టుగా అవతరించింది. 2024లో $227 మిలియన్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ విలువ, ఈ ఏడాది $269 మిలియన్లకు పెరిగింది. ముంబై ఇండియన్స్ (MI) రెండో స్థానానికి చేరుకోగా, CSK మూడో స్థానానికి పడిపోయింది. CSK బ్రాండ్ విలువ కేవలం స్వల్పంగా పెరిగి $231 మిలియన్ల నుంచి $235 మిలియన్లకు చేరింది.
36
పంజాబ్ కింగ్స్ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది
పంజాబ్ కింగ్స్ (PBKS) బ్రాండ్ విలువలో 39.6% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది $101 మిలియన్లుగా ఉన్న విలువ, ఈ ఏడాది $141 మిలియన్లకు చేరింది. దీనికి ప్రధాన కారణం రన్నరప్ గా నిలవడం, ఆగ్రెసివ్ ఆటగాళ్ల వేలం వ్యూహం, డిజిటల్ ప్రచారాల ప్రభావం ఉన్నాయని నివేదిక పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 34% వృద్ధితో తరువాతి స్థానంలో నిలిచింది.
హూలిహాన్ లోకీ నివేదిక ప్రకారం, ఐపీఎల్ ప్రత్యేకత తక్కువ మూలధనంతో, స్థిరమైన నగదు ప్రవాహాలు కలగలిపిన వ్యాపార నమూనాలో ఉంది. జట్లకు వచ్చే ఆదాయాల్లో ప్రధానంగా బీసీసీఐ నిర్వహించే మీడియా, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా ముందుగానే ఆదాయం విలువ తెలుస్తుంది. బీసీసీఐ ఆధ్వర్యంలోని స్టేడియంలు, రూ.120 కోట్ల జీతాల పరిమితి వంటి కారకాలు, జట్లకు అధిక పెట్టుబడులు లేని లాభదాయకతను అందిస్తున్నాయి.
56
ఐపీఎల్ ప్రకటనల ఆదాయాల్లో విప్లవాత్మక వృద్ధి
2025 ఐపీఎల్ సీజన్‌లో ప్రకటనల ఆదాయాలు $600 మిలియన్ల (సుమారు రూ.5,000 కోట్లు)ను దాటి, గత ఏడాదితో పోలిస్తే 50% పెరిగాయి. బీసీసీఐ అమ్మిన నాలుగు అసోసియేట్ స్పాన్సర్‌షిప్ డీల్స్.. మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, సీఏటీతో కలిపి రూ.1,485 కోట్లు సంపాదించింది. టాటా గ్రూప్ ఐదు సంవత్సరాల పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను రూ.2,500 కోట్ల ఒప్పందంతో 2028 వరకు కొనసాగించనుంది.
66
ఐపీఎల్ లో రికార్డు వ్యూయర్‌షిప్: ఆర్సీబీ-పంజాబ్ ఫైనల్ చరిత్ర సృష్టించింది
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా కొంతకాలం నిలిపివేశారు. అయినా చివరికి అత్యధిక వ్యూయర్‌షిప్‌తో ముగిసింది. మార్చి 22-24 మధ్య జరిగిన ఓపెనింగ్ వీకెండ్‌లో JioHotstar 1.37 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 340 మిలియన్ రియల్ టైమ్ వీక్షకులు ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్ 253 మిలియన్ ప్రత్యేక టీవీ వీక్షకులను ఆకర్షించింది. మొత్తం వాచ్‌టైమ్ 49.5 బిలియన్ నిమిషాలుగా నమోదైంది.
జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించగా, ఈ మ్యాచ్ JioHotstarలో 678 మిలియన్లకు పైగా వ్యూస్‌ను నమోదు చేసి, ఇప్పటివరకు టీవీ లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రసారమైన అత్యధిక వీక్షణ కలిగిన T20 క్రికెట్ మ్యాచ్‌గా నిలిచింది. ఇదే సంవత్సరం జరిగిన ఇండియా-పాకిస్తాన్ ఐసీసీ మ్యాచ్‌ను కూడా ఇది అధిగమించింది.