India vs England: లార్డ్స్ లో భారత్ vs ఇంగ్లాండ్ హోరాహోరీ.. ఎక్కడ ఫ్రీగా లైవ్ చూడొచ్చు?

Published : Jul 08, 2025, 10:12 PM IST

India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది. రెండు టెస్టులు పూర్తికాగా, మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. హోరాహోరీ అంచనాలున్న ఈ మ్యచ్ ను ఎక్కడ ఫ్రీగా లైవ్ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
భారత్ vs ఇంగ్లాండ్: లార్డ్స్ టెస్టుకు రంగం సిద్ధం

భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో మూడో మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో ఈ టెస్ట్ ఫలితం రెండు జట్లను ప్రభావితం చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా సిరీస్ లో ఏ జట్టు ఆధిపత్యం వైపు దూసుకెళ్తుందనే ఉత్కంఠగా నెలకొంది.

26
భారత్ జైత్రయాత్రలో గిల్, ఆకాష్ దీప్ మెరుపులు

ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. భారత్, ఇంగ్లాండ్ జట్లు చెరో మ్యాచ్ ను గెలుచుకున్నాయి. రెండో టెస్టులో కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్భుతంగా ఆడి ఒక డబుల్ సెంచరీతో పాటు సెంచరీ బాదాడు. 

ఇక బౌలింగ్ లో ఆకాష్ దీప్ పది వికెట్లతో ప్రత్యర్థి జట్టును దెబ్బతీయడం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వీరి ప్రదర్శన భారత్‌కు మూడో టెస్టు ముందు గొప్ప బలాన్నిచ్చింది.

భారత జట్టులో ఫాస్ట్ బౌలింగ్ దళాన్ని మరింత బలోపేతం చేసేలా జస్ప్రిత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం ఖాయం అనిపిస్తోంది. ఇది పేస్ పిచ్‌ గల లార్డ్స్‌లో భారత్‌కు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.

36
ఇంగ్లాండ్ వ్యూహాలు.. జట్టులోకి తిరిగివస్తున్న ఆర్చర్‌

ఇంగ్లాండ్ గత టెస్టులో నిరుత్సాహకర ప్రదర్శన తర్వాత తమ బౌలింగ్ దళాన్ని మార్చే పనిలో పడింది. జోఫ్రా ఆర్చర్‌ను మూడో టెస్టులో తీసుకురావాలని భావిస్తోంది. దీనితో ఆ జట్టు పేస్ దళాన్ని మరింత బలపర్చాలని లక్ష్యం పెట్టుకుంది.

లార్డ్స్ పిచ్ సాధారణంగా పేసర్లకు అనుకూలంగా ఉండేలా ఉంటుంది. బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్ కావడంతో ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నట్లు అంచనా.

46
భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది?

• మ్యాచ్: భారత్ vs ఇంగ్లాండ్ - మూడో టెస్ట్

• ఎప్పుడు: 2025 జూలై 10 నుండి జూలై 14 వరకు

• వేదిక ఏది: లార్డ్స్ క్రికెట్ మైదానం, లండన్

• మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది: ఉదయం 11:00 BST (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:30 IST)

భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టీవీ ప్రత్యక్ష ప్రసారం వివరాలు

• భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ ఏ టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది : Sony Sports Ten 1, Ten 5 (ఇంగ్లీష్), Ten 3 (హిందీ)

• OTT ప్లాట్‌ఫామ్‌లు: జియో సినిమా, జియో హాట్‌స్టార్ మొబైల్ యాప్, వెబ్‌లో లైవ్ ప్రసారం అవుతుంది.

56
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్

ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ మొదటి టెస్టులో విజయం సాధించింది. రెండో టెస్టులో భారత్ విజయంతో 1-1 సమంగా సిరీస్ కొనసాగుతోంది. లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్ ద్వారా సిరీస్ ను ఎవరు గెలుస్తారనే దానిపై స్పష్టత రానుంది.

భారత జట్టుకు ప్రస్తుతం శుభ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. రిషభ్ పంత్ డిప్యూటీగా ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు యంగ్ ప్లేయర్లతో ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది.

66
భారత్ vs ఇంగ్లాండ్: లార్డ్స్‌లో హెడ్ టు హెడ్ రికార్డులు

లార్డ్స్ గ్రౌండ్ లో భారత్ vs  ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్  లు మొత్తం 19 జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ 12 విజయాలు అందుకుంది. భారత జట్టు కేవలం 3 మ్యాచ్ లను మాత్రమే గెలుచుకుంది. మరో 4 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. 

లార్డ్స్ లో చివరిసారి భారత్ ఇంగ్లాండ్ జట్లు 2021లో తలపడ్డాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ అద్భుతమైన టీం ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది. అలాగే, లార్డ్స్‌లో ఇంగ్లాండ్ చివరి సారి భారత్‌ను 2018లో ఓడించింది.

ఇంగ్లాండ్ లార్డ్స్‌లో భారత్‌పై ఉన్న విన్నింగ్స్ రేటు చాలా అధికంగా ఉంది. కానీ, ఇటీవల భారత్ బలమైన ప్రదర్శనలతో ముందుకు సాగుతోంది. దీంతో లార్డ్స్ లో మరో బిగ్ ఫైట్ ఉత్కంఠ మ్యాచ్ ను చూడవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories