Wiaan Mulder: వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా రికార్డుకు 33 పరుగులు దూరంలో ఉన్న సమయంలో వియన్ ముల్డర్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?
వియన్ ముల్డర్ 367 పరుగులకు డిక్లేర్.. ఆశ్చర్యంలో క్రికెట్ ప్రపంచం
బులవాయోలో జింబాబ్వే తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియన్ ముల్డర్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బ్రియాన్ లారా చేసిన 400 పరుగుల టెస్ట్ రికార్డును కేవలం 33 పరుగుల దూరంలో ఉన్న ముల్డర్.. 367 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం సంచలనంగా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ప్రారంభంలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు టోనీ డి సొర్సీ (0), లెసెగో సెనోక్వానే (3) త్వరగానే అవుటయ్యారు. అయితే మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ ముల్డర్, తన దూకుడు ఆటతో మ్యాచునే మలుపు తిప్పాడు.
25
బౌండరీల వర్షం కురిపించిన ముల్డర్
వియన్ ముల్డర్ తన ఇన్నింగ్స్‌ను వన్డే తరహాలో ఆడాడు. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో క్రికెట్ లవర్స్ ను మంత్రముగ్దులను చేశాడు. సెంచరీ తర్వాత ఆ ఇన్నింగ్స్ ను డబుల్ సెంచరీగా మార్చాడు. అంతటితోనే ఆగిపోకుండా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 367 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు.
35
లారా రికార్డును గౌరవిస్తూ ముల్దర్ డిక్లేర్ నిర్ణయం
367 వద్ద ముల్డర్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. లారా చేసిన 400 పరుగుల టెస్ట్ రికార్డును అధిగమించే అవకాశం ఉన్న సమయంలో, ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగానే డిక్లేర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముల్డర్ నిర్ణయం అభిమానులను, సహచరులను, ప్రత్యర్థులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
1998లో మార్క్ టేలర్ 334 వద్ద డిక్లేర్ చేసి, డాన్ బ్రాడ్మన్‌ను గౌరవించిన విధంగా, ఇప్పుడు ముల్డర్ కూడా బ్రియాన్ లారాను గౌరవిస్తూ తన ఇన్నింగ్స్‌ను ముగించినట్లు భావిస్తున్నారు.
జింబాబ్వే ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా
మ్యాచ్ మూడో రోజు జింబాబ్వే 51/1 వద్ద ఆటను కొనసాగించింది. మొదటి సెషన్‌లోనే తకుడ్జ్వానాషే కైటానో (40) అవుట్ కాగా, ముల్డర్ షాన్ విలియమ్స్‌ను బోల్తా కొట్టించాడు. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ (49), నిక్ వెల్చ్ (55) మధ్య 50+ భాగస్వామ్యం వచ్చింది. కానీ, సామి, ముల్డర్ కలిసి కీలక బ్రేక్‌త్రూ అందించారు.
జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. 8 వికెట్లు 67 పరుగులకే కోల్పోయి జట్టు పూర్తిగా పతనమైంది. కోడి యూసఫ్, కార్బిన్ బోష్, సామి మిగిలిన వికెట్లు తీసి జింబాబ్వేను 220 పరుగులకే ఆలౌట్ చేశారు.
సౌతాఫ్రికా 626/5 d
జింబాబ్వే 170 & 220 (f/o)
55
జింబాబ్వే పై 0-2 దక్షిణాఫ్రికా సిరీస్ గెలుపు
సౌతాఫ్రికా జట్టు 626/5 స్కోరు చేసి 5.49 రన్ రేట్‌తో ఆడుతున్న సమయంలో ముల్డర్ డిక్లేర్ చేయడం అత్యవసరమేమీ కాదు. ప్రత్యర్థి జట్టు జింబాబ్వే పోటీని ఇవ్వడంలో బలహీనంగా ఉండటం, ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉండటంతో ముల్డర్ 400 పరుగుల మైలురాయిని దాటి లారా రికార్డును చెరిపేసే అవకాశం స్పష్టంగా కనిపించింది.
కానీ ముల్డర్, వ్యక్తిగత గౌరవం కన్నా జట్టు అవసరాలను మొదటిగా చూసి, టెస్ట్ క్రికెట్ విలువలను నిలబెట్టాడు. ఇది నేటి క్రికెట్‌లో అరుదైన నిర్ణయంగా పలువురు క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ విజయం ద్వారా దక్షిణాఫ్రికా 2-0తో టెస్ట్ సిరీస్‌ను స్వీప్ చేసింది. ముల్డర్ చేసిన 367 పరుగులతో పాటు బౌలింగ్ లో కూడా సత్తా చాటడంతో సౌతాఫ్రికా సూపర్ విక్టరీ కొట్టింది.