టీమిండియా కోచ్‌గా అతనా? అదే నిజమైతే మిగిలిన దేశాలన్నీ జాగ్రత్త పడాల్సిందే... మైకేల్ వాగన్ ట్వీట్ వైరల్...

Published : Oct 16, 2021, 01:12 PM ISTUpdated : Oct 16, 2021, 01:13 PM IST

టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ని నియమిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది... అండర్19 కోచ్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ అయిన ద్రావిడ్ శిక్షణలో భారత్ మరింత దృఢంగా, పటిష్టంగా మారుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

PREV
18
టీమిండియా కోచ్‌గా అతనా? అదే నిజమైతే మిగిలిన దేశాలన్నీ జాగ్రత్త పడాల్సిందే... మైకేల్ వాగన్ ట్వీట్ వైరల్...

రాహుల్ ద్రావిడ్‌ను కోచ్‌గా నియమిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు...

28

టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం నిజమైతే... మిగిలిన దేశాలన్నీ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు మైకెల్ వాగన్...

38

ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యుడిగా మారిన శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ వంటివాళ్లకి మెంటర్‌గా వ్యవహరించింది రాహుల్ ద్రావిడే...

48

రాహుల్ ద్రావిడ్ అండర్19 కోచ్‌గా ఉన్న సమయంలో అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లోని పృథ్వీషా, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, ఆవేశ్ ఖాన్... ఇప్పుడు భారత జట్టులో భావి స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు...

58

వీరితో పాటు రవి భిష్ణోయ్, ప్రియమ్ గార్గ్, యశస్వి జైస్వాల్, కార్తీక్ త్యాగి వంటి ఎందరో యువ క్రికెటర్లకు మార్గనిర్దేశకుడిగా ఉండి, వారి సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు రాహుల్ ద్రావిడ్...

68

రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో 2016 అండర్10 వరల్డ్‌కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు, 2018లో టైటిల్ గెలిచింది.. 2019 తర్వాత ఎన్‌సీఏ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ద్రావిడ్...

78

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత జరిగే న్యూజిలాండ్, ఇండియా టీ20 సిరీస్ నుంచి భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు రాహుల్ ద్రావిడ్...

88

2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ హెడ్‌కోచ్‌గా కొనసాగే రాహుల్ ద్రావిడ్‌కి రెండేళ్లకు కానూ దాదాపు రూ.10 కోట్లు పారితోషికంగా చెల్లించనుంది బీసీసీఐ...
 

ఇదీ చదవండి: కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్... ఆవేశ్, గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్... కివీస్‌తో టీ20 సిరీస్‌కి...

 సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... 

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

click me!

Recommended Stories