కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్... ఆవేశ్, గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్... కివీస్‌తో టీ20 సిరీస్‌కి...

First Published Oct 16, 2021, 12:21 PM IST

IPL 2021 సీజన్ ముగిసింది. T20 వరల్డ్‌కప్ 2021 సందడి మొదలైంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్ తర్వాత మూడు రోజులకే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భాగంగా అక్టోబర్ 18న ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడే భారత జట్టు, అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది...

అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ఆరంభించే టీమిండియా... నవంబర్ 8న సూపర్ 12 రౌండ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడుతుంది...

ఆ తర్వాత సెమీస్, ఫైనల్‌కి అర్హత సాధిస్తే... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్ నవంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్ జరిగిన మూడు రోజులకు నవంబర్ 17న న్యూజిలాండ్‌తో జైపూర్‌తో టీ20 మ్యాచ్ ఆడుతుంది టీమిండియా...

ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడనుంది భారత జట్టు. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకుని, టీ20 సిరీస్ ఆడడమంటే చాలా కష్టమే...

అందుకే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైన భారత ప్రధాన జట్టులోని ప్లేయర్లందరికీ విశ్రాంతి కల్పించాలని భావిస్తున్నారు సెలక్టర్లు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రాలతో పాటు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపికైన ప్లేయర్లు అందరూ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి దూరంగా ఉంటారు...

వీరిస్థానంలో ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు... టీ20 సిరీస్‌ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది..

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ సిరీస్‌లో అవకాశం దక్కుతుందని టాక్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీతో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగుస్తుండడంతో అతని స్థానంలో కొత్త కోచ్‌గా బాధ్యతలు తీసుకునే రాహుల్ ద్రావిడ్‌కి పూర్తిస్థాయి కోచ్‌గా ఇదే తొలి సిరీస్ కానుంది...

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ సమయానికి సీనియర్లు, భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తారు. నవంబర్ 25న కాన్పూర్‌లో మొదటి టెస్టు, డిసెంబర్ 3న ముంబైలో రెండో టెస్టు జరుగుతాయి...

click me!