India vs England: లైవ్ మ్యాచ్‌లో జో రూట్, ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు గొడవ పడ్డారు?

Published : Aug 02, 2025, 09:17 PM IST

Prasidh Krishna Joe Root Fight: ఇంగ్లాండ్-భార‌త్ టెస్టు సిరీస్ లో ప్లేయ‌ర్ల మ‌ధ్య వాగ్వాదం ఓవల్ టెస్టులో మ‌రింత హీటును పెంచింది.  ఈ క్ర‌మంలోనే తాజాగా జో రూట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ లైవ్ మ్యాచ్ లోనే గొడ‌వ‌ప‌డ్డారు.

PREV
15
జో రూట్ - ప్రసిద్ధ్ కృష్ణ ఫైట్

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య లండన్‌లోని కెనింగ్‌టన్ కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానంలో 5వ టెస్టు జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండా 247 ర‌న్స్ తో ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లాండ్ 129/2 వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా జో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. త‌న మొదటి బంతి జోరూట్‌ చేతికి తాకింది. రెండు బంతుల తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వేసిన వాబుల్-సీమ్ డెలివరీ జో రూట్‌ డిఫెన్స్‌ను దెబ్బ‌కొట్టింది. ఈ సమయంలో రూట్‌తో ప్రసిద్ధ్ ఏదో అన్నాడు. ఇది ఇరువురు ప్లేయ‌ర్ల మ‌ధ్య వాగ్వాదానికి దారి తీసింది.

DID YOU KNOW ?
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఐదుగురు ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత జో రూట్ (13,417 పరుగులు), రికీ పాంటింగ్ (13,378 పరుగులు), జాక్వెస్ కాలిస్ (13,289 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,288 పరుగులు) లు ఉన్నారు.
25
రూట్ - ప్రసిద్ధ్ వాగ్వాదంతో హీటెక్కిన గ్రౌండ్

ఆ త‌ర్వాత వేసిన బంతిని జోరూట్ ఫోర్ గా మ‌లిచాడు. ప్రసిద్ధ్ ను చూసి రూట్ ఏదో అన్నాడు. దీంతో ప‌రిస్థితి మ‌రింత హాట్ గా మారింది. ఓవర్‌ ముగిసిన తర్వాత కూడా వీరి మ‌ధ్య వాగ్వాదం కొన‌సాగింది. దీంతో అంపైర్ కుమార ధర్మసేనా క‌లుగ‌జేసుకుని దీనిని ఆపారు. ప్రసిద్ధ్‌తో మాట్లాడి పరిస్థితిని నియంత్రించారు. అయితే ప్రసిద్ధ్ ఏం అన్నాడో స్టంప్ మైకులో స్పష్టంగా వినిపించలేదు.

35
ఈ ఫైట్ పై ప్రసిద్ధ్ ఏమ‌న్నారంటే?

ఈ ఘటనపై పేస్ బౌలర్ ప్రసిద్ధ్‌ కృష్ణ‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “నిజంగా నాకు జో రూట్‌ ఎందుకు అలా స్పందించాడో అర్థం కాలేదు. నేను కేవలం ‘మీరు మంచి లయలో ఉన్నారు’ అని అన్నాను. అది ఇలా తీవ్ర వాగ్వాదంగా మారుతుందని అనుకోలేదు” అని తెలిపారు.

ఇది పూర్తిగా ముందుగా ఏర్పరచుకున్న వ్యూహమని, జో రూట్‌ ఫోకస్‌ను డైవర్ట్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఆ మాట అన్నానని ప్ర‌సిద్ధ్ కృష్ణ చెప్పారు.

45
రూట్‌ను ఆటపట్టించడం వ్యూహంలో భాగం

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ‌ మాట్లాడుతూ.. “ఈ వ్యవహారం నా ప్రణాళికలో భాగమే. కానీ నా మాటలకు రూట్‌ ఇలా తీవ్రంగా స్పందిస్తాడని ఊహించలేదు. బౌలింగ్ చేస్తున్నపుడు నేను ఆటను ఆస్వాదిస్తాను. ప్రతిసారీ బాట్స్‌మెన్‌ను మానసికంగా టెస్ట్ చేయడంలో ఆనందిస్తాను. ఎవరైనా ఆటగాడి నుండి స్పందన వస్తే అది నా బౌలింగ్ కు కొత్త‌ ఊపిరిలా ఉంటుంది” అన్నారు. అంతేకాకుండా జో రూట్‌ను తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ అని కూడా చెప్పాడు.

55
భారీ ఆధిక్యం దిశ‌గా భార‌త్

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి 23 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 310/6 ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు 287 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఈ టెస్ట్ మ్యాచ్‌ను గెలవడం భారత జట్టుకు తప్పనిసరి. ఎందుకంటే ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేయగలుగుతారు. ప్రస్తుతం టెస్ట్ సిరీస్‌ ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. క్రీడా మైదానంలో ప్రతిసారీ వాగ్వాదాలు సహజం. కానీ ప్రసిద్ధ్ కృష్ణ - జో రూట్ మధ్య చోటు చేసుకున్న ఈ చిన్న సంఘటన వెనుక ప్రణాళికాబద్ధమైన వ్యూహం ఉందన్న సంగతి తాజాగా వెలుగుచూసింది.

Read more Photos on
click me!

Recommended Stories