IND vs ENG: మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలు అద్భుతమైన బౌలింగ్ తో ఓవల్‌లో భారత్ కు విజయాన్ని అందించారు. చివరి టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో చారిత్రాత్మక గెలుపు అందుకుంది.
ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానం ఒక్కసారిగా ముంబయి వాంఖడే లేదా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లా మారింది. మేఘాలతో కమ్ముకుపోయిన ఉదయంలో భారత జట్టు ఓ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఇది కేవలం ఓ మ్యాచ్ గెలుపు కాదు.. భారత్ ను చాలా కాలం పాటు శాసించిన బ్రిటిష్ రాజ్యాన్ని వారి నేల మీదే ఓడించిన గర్వించదగ్గ క్షణాలు.
DID YOU KNOW ?
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025: టాప్ బౌలర్ సిరాజ్
ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు. ఓవల్ టెస్ట్‌లో అతను 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా సిరీస్‌లో 23 వికెట్లు తీసుకున్నాడు. 5వ రోజు అతను మూడు విలువైన వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు.
25
6 పరుగుల తేడాతో విజయం.. సిరీస్‌ను సమం చేసిన భారత్
ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తమ అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టుకు అత్యంత చిరస్మరణీయ గెలుపును అందించారు. 6 పరుగుల తేడాతో భారత్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ఇది భారత్‌కి టెస్ట్ క్రికెట్‌లో అత్యంత తక్కువ పరుగుల తేడాతో వచ్చిన విజయం కావడం విశేషం. సీనియర్ స్టార్ ప్లేయర్లు లేకపోయినా శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని యంగ్ ఇండియా దుమ్మురేపే ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది.
35
సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ మాయాజాలం
ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 17 వికెట్లను ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ జోడీ సాధించింది. సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ద్ కృష్ణ 8 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టారు. నాలుగో రోజు నుండి ఐదో రోజు వరకు ఈ యంగ్ జోడీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో భారత్ కు విజయాన్ని అందించింది.
ఐదవ రోజు ఆట ప్రారంభంలో ఇంగ్లాండ్ విజయానికి కేవలం 35 పరుగుల దూరంలో ఉంది. కానీ భారత బౌలర్ల ఉగ్రరూపంలో విరుచుకుపడటంతో ఎక్కువ సేపు ఎదురు నిలువలేకపోయారు. మొదట మహమ్మద్ సిరాజ్ జేమీ స్మిత్‌ని ఔట్ చేశాడు. తర్వాత జేమీ ఓవర్టన్‌ని పెవిలియన్ పంపాడు.
ప్రసిద్ద్ కృష్ణ జోష్ టంగ్‌ను బోల్తా కొట్టించాడు. చివర్లో క్రిస్ వోక్స్ ఒక చేత్తో బ్యాట్ పట్టుకుని వచ్చి.. గస్ అట్కిన్సన్ తో కలిసి విజయానికి మరింత చేరువచేశారు. కానీ మళ్లీ సిరాజ్ మాయాజాలం ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది. ఆఖరి వికెట్‌ను సాధించి భారత్‌ను గెలిపించాడు.
55
సిరాజ్ ఏమన్నారంటే..?
మ్యాచ్ అనంతరం మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. “నేను క్యాచ్ మిస్సయిన తర్వాత గెలవలేమేమో అనుకున్నా. కానీ ఈ రోజు ఉదయం నేను ఈ మ్యాచ్‌ని మార్చుతానని నమ్ముకంతో ఉన్నాను.. అదే జరిగింది. నిరంతరం బ్యాటర్లపై ఒత్తిడి పెడుతూ బౌలింగ్ చేశాను. ఈ సిరీస్‌లో మన జట్టు అద్భుత పోరాటం చేసింది.. అది అందరికీ తెలుసు.. అందరికీ అభినందనలు” అని అన్నారు.
ఈ గెలుపు కేవలం క్రీడ పరంగా మాత్రమే కాక, భారత దేశపు సమాఖ్య ఆత్మను ప్రతిబింబించింది. మత, భాష, ప్రాంతాల్ని అధిగమించి భారతదేశం ఎలా ముందుకు పోతుందో, ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ మైత్రీ అది ఎలా సాధ్యం చేసిందో చూపించింది. ఈ దృక్పథమే భారతను ఒక శక్తివంతమైన, సమన్వయ భరిత దేశంగా నిలుపుతోంది.