Published : Aug 04, 2025, 04:28 PM ISTUpdated : Aug 04, 2025, 04:37 PM IST
IND vs ENG: ఓవల్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ 5వ టెస్టులో ఉత్కంఠగా సాగింది. అద్భుతమైన కమ్ బ్యాక్ తో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 2–2తో సమం చేసింది. ప్రసిధ్, జైస్వాల్, సిరాజ్ హీరోయిక్ పాత్ర పోషించారు.
2025లో జరిగిన ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ అద్భుతమైన కమ్ బ్యాక్ తో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఇంగ్లాండ్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై 2–1తో వెనకబడిన టీమ్‌ఇండియా, ఓవల్‌లో జరిగిన 5వ టెస్టులో ఉత్కంఠతతో కూడిన పోరు విజయంతో 2–2 సిరీస్ ను సమం చేసింది. ఇది సిరీస్ గెలుపు కాకపోయినా గర్వించదగిన క్షణాలు.
25
మొదటి రెండు రోజులు భారత్ కు షాక్
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ పచ్చిక పిచ్‌పై బౌలింగ్ ఎంచుకుంది. వర్షం, స్వింగ్‌తో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరుణ్ నాయర్ (3000 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ) సహకారంతో తొలి రోజు భారత్ 204/6 స్కోరుతో నిలిచింది. రెండో రోజు భారత్ మొత్తం 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం పొందింది.
35
మూడో రోజు జైస్వాల్ సెంచరీతో భారత్ దూకుడు
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బలంగా పుంజుకుంది. యశస్వి జైస్వాల్ మరో సెంచరీ చేయడంతో భారత్ 396 పరుగులు చేసింది. ఇది టెస్టు సిరీస్‌లో ఏదైనా జట్టు చేసిన అత్యధిక సెంచరీల రికార్డు. వారికి తోడుగా వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజాలు కీలక ఇన్నింగ్స్ లను ఆడారు. దీంతో ఇంగ్లాండ్ ముందు భారత్ 374 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
నాలుగో రోజు జోరూట్, హ్యారీ బ్రూక్ సెంచరీలతో ఇంగ్లాండ్ పోరాటం
జో రూట్ (105 పరుగులు), హ్యారీ బ్రూక్ (111 పరుగులు)సెంచరీలతో ఇంగ్లాండ్ ను గెలుపు అంచులకు తీసుకువచ్చారు. జోరూట్ 39వ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. నాలుగో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 339/6 పరుగులతో నిలిచింది. కేవలం 35 పరుగుల దూరంలో మాత్రమే ఉండటం మ్యాచ్‌ను హాట్‌స్పాట్‌గా మార్చింది.
55
ఐదో రోజు సిరాజ్, ప్రసిద్ధ్ మెరుపు.. గెలుపు భారత్‌దే
చివరి రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సిరాజ్, ప్రసిద్ధ్ దుమ్మురేపారు. ప్రసిద్ధ్ కృష్ణ 4/62తో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అందించాడు. ముందు ఇంగ్లాండ్ పిచ్‌కు అతను తగడు అనే విమర్శల నడుమ తన అద్భుత బౌలింగ్ తో అదరగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ ప్రారంభంలో జాక్ క్రాలీ వికెట్‌తో మోమెంటాన్ని భారత్ వైపు తిప్పాడు. అ తర్వాత జేమీ స్మిత్ ను అవుట్ చేశాడు. మరోసారి ప్రసిద్ధ్ జోష్ టంగ్ ను అవుట్ చేశాడు. చివరి వికెట్ గా జోష్ అట్కిన్సన్ ను అవుట్ చేసి సిరాజ్ భారత్ కు విజయాన్ని అందించాడు. సిరాజ్ 5 వికెట్లు పడగొట్టాడు.