పాకిస్తాన్ కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. ట్రై సిరీస్ జరిగేనా?

Published : Oct 13, 2025, 11:47 PM IST

Pakistan Afghanistan Conflict : ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ కు ఆఫ్ఘన్ వరుస షాక్ లు ఇస్తోంది. పాక్, శ్రీలంక, ఆఫ్ఘన్ జట్ల మధ్య నవంబర్ 17 నుండి లాహోర్, రావల్పిండిలో ట్రై సిరీస్ జరగాల్సి ఉంది.

PREV
15
పెరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల తీవ్రమైన మిలిటరీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా రెండు దేశాలకు భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ సైన్యం ప్రకారం, 200 మందికి పైగా తాలిబాన్, ఇతర మిలిటెంట్లు హతమయ్యారు. 23 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.

ఇక అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మాత్రం 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని, అఫ్గానిస్థాన్ తమ లక్ష్యాలను సాధించిందని తెలిపారు. ఈ ప్రకటనలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి.

తాజాగా పాక్ తో జరిగే మ్యాచ్ ను రద్దుచేసుకోవాలని ఆఫ్ఘన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అలాగే, కాబూల్ పర్యటనకు వద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా, ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ విసాలను రిజెక్ట్ చేసింది.

25
క్రికెట్ సంబంధాలు కట్.. ట్రై సిరీస్‌ లేనట్టేనా?

ఈ సరిహద్దు వివాదం కారణంగా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రభావం పడింది. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన టీ20 ట్రై సిరీస్ పై దెబ్బపడిందని సమాచారం. ఈ సిరీస్ నవంబర్ 17 నుంచి రావల్పిండిలో ప్రారంభం కావాల్సివుంది. నవంబర్ 29న ఫైనల్ జరగాల్సి ఉంది.

అయితే, ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో ఆడే అవకాశం లేదని సమాచారం. పాక్ లో పర్యటించకూడదని ఆఫ్ఘన్ నిర్ణయం తీసుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఐసీసీకి ఇదే విషయంపై ప్రతిపాదన పంపారు. ఆఫ్ఘనిస్తాన్ తప్పుకుంటే మరో జట్టును ఆహ్వానించే అవకాశం పరిశీలిస్తున్నారు.

35
ఆఫ్ఘన్ దెబ్బతో ప్రత్యామ్నాయాలు చూస్తున్న పాక్

ఆఫ్ఘన్ దెబ్బతో పీసీబీ ప్రస్తుతం పలు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనకపోతే, మరో జట్టును ఆహ్వానించడమే కాకుండా, శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను జనవరిలో కొలంబోలో నిర్వహించే యోచనలో ఉందని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ షెడ్యూల్ జనవరి 1–10 మధ్య ఉంటే, పాకిస్తాన్ కీలక ఆటగాళ్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్, షాహీన్ ఆఫ్రిదీ వంటి వారు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొంటున్నారు కాబట్టి, ట్రైసిరీస్ జరిగేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

45
పాక్ ఆటగాళ్లతో పీసీబీకి టైమింగ్ సమస్యలు

బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు జరగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆటగాళ్లు పాల్గొనడం వల్ల, ట్రై సిరీస్ లో పాక్ కు టైమింగ్ సమస్యలు వస్తున్నాయి. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత, పీసీబీ విదేశీ లీగ్‌లలో ఆడేందుకు ఆటగాళ్లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో క్రికెట్ ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లు లేకుండా బిగ్ బాష్ లీగ్‌ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆస్ట్రేలియా భావిస్తోంది. దీనిపై పాక్ త్వరలోనే మరో నిర్ణయం తీసుకోనుందని కూడా అక్కడి స్థానిక మీడియా పేర్కొంటోంది.

55
కొత్త దిశలో ఆఫ్ఘనిస్తాన్, భారత్ సంబంధాలు

సరిహద్దు ఉద్రిక్తతల మధ్య, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం భారత్ వైపు అడుగులు వేస్తోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ముత్తాఖీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమై, రాజకీయ, వాణిజ్య అంశాలపై చర్చించారు. భారత్ త్వరలో కాబూల్‌లో తన ఎంబసీని తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్‌ను తమకు సన్నిహిత దేశంగా పేర్కొంది. ఇది పాకిస్తాన్‌పై ఆఫ్ఘన్ వైఖరిలో మార్పు సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం కేవలం రాజకీయ స్థాయిలోనే కాకుండా, క్రీడా రంగంలోనూ ప్రభావం చూపుతోంది. పాక్ తో వివాదం మధ్య తాలిబన్ సర్కారు భారత్ తో సంబంధాలు పెంచుకుంటుండటంతో దక్షిణాసియా రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరుగుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories