Virat Kohli: ఐపీఎల్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్.? 2026 మెగా వేలం ముందే..!

Published : Oct 13, 2025, 12:00 PM IST

Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ మెగా వేలానికి ముందుగా పెద్ద బాంబ్ లాంటి వార్త ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్ ముందుగా ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని సమాచారం. మరి అదేంటో ఈ వార్తలో చూసేద్దాం. 

PREV
15
ఐపీఎల్ నుంచి కోహ్లీ రిటైర్.?

ఆర్‌సీబీ పోస్టర్ బాయ్, జట్టులో కీలక సభ్యుడైన విరాట్ కోహ్లీ.. 2026 సీజన్ మెగా వేలానికి ముందుగా ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని పొడిగించడానికి ఆసక్తి చూపించట్లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నాటకీయ పరిణామం అతడు ఐపీఎల్‌లో పాల్గొనడంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. జాతీయ కథనాలు ప్రకారం.. ఆర్‌సీబీ బ్రాండ్ కార్యకలాపాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందంపై కోహ్లీ సంతకం చేయాల్సి ఉంది.

25
ఫ్రాంచైజీకి కోహ్లీ షాక్..!

కానీ మాజీ కెప్టెన్ ఈ ఒప్పందాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు అంతర్గత వర్గాలు సూచిస్తున్నాయి. కోహ్లీ లేదా ఫ్రాంచైజీ బహిరంగంగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం ఆర్సీబీ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది. 

35
తన బ్రాండ్ లేకుండానే ఆర్సీబీ..!

'ఐపీఎల్ తదుపరి సీజన్(అంటే 2026లో) మెగా వేలానికి ముందు, విరాట్ కోహ్లీ ఒక బ్రాండ్‌తో అనుబంధంగా ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. కానీ అతను తన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. విరాట్ తన బ్రాండ్ ఉపయోగించకుండా RCB ఫ్రాంచైజీ తమ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలని కోరుకుంటున్నాడని ఊహాగానాలు వస్తున్నాయి' అని జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

45
కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌కు మద్దతు

గత సంవత్సరం కూడా మెగా వేలానికి ముందు అతనికి RCB జట్టు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినప్పుడు దానిపై ఆసక్తి చూపలేదు. రజత్ పాటిదార్‌కు పూర్తి మద్దతు ఇచ్చి కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2027 వన్డే ప్రపంచకప్ అంశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండరని చీఫ్ సెలెక్టర్ చెప్పడం.. అలాగే ఈ ఇద్దరు వన్డేలకు కూడా త్వరలోనే రిటైర్‌మెంట్ ఇస్తారని వార్తలు వస్తుండటం తెలిసింది.

55
కోహ్లీకి ఐపీఎల్ 2026 లాస్ట్ సీజన్.?

ఇప్పుడు ఈ రూమర్స్ చూస్తుంటే.. ఐపీఎల్‌కు కూడా విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం లేకపోలేదు. కాగా, వచ్చే సీజన్ ముందే ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లేదా కోహ్లీకి ఐపీఎల్ 2026 లాస్ట్ సీజన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

Read more Photos on
click me!

Recommended Stories