ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏ ICC టోర్నీ అయినా సరే, భారత్ పాక్ మ్యాచ్‌లు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.
"నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఉగ్రవాదం ఆగేంతవరకూ భారత్–పాకిస్థాన్ మధ్య ఏ మ్యాచ్ కూడా ఉండకూడదు. ఈ విషయం మీద నేను గతంలోనూ చెప్పాను," అని గంభీర్ అన్నారు.
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు, మరణించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఇందస్ వాటర్ ట్రిటీని నిలిపివేసింది, అటారి సరిహద్దును మూసివేసింది. పాక్‌తో డిప్లమాటిక్ సంబంధాలను తగ్గించింది.