IPL Dhoni: ధోనీ పై చెన్నై నమ్మకం కోల్పోయిందా? CSK లోకి కొత్త వికెట్ కీపర్ ఎంట్రీ !

Published : May 06, 2025, 09:45 PM IST

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ధోనీపై నమ్మకం కోల్పోయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో చెన్నై టీమ్ యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ధోని సంగతేంటి? ఏం చేయబోతున్నారు? 

PREV
16
IPL Dhoni: ధోనీ పై  చెన్నై నమ్మకం కోల్పోయిందా? CSK లోకి కొత్త వికెట్ కీపర్ ఎంట్రీ !

CSK MS Dhoni: ​​​​​​ఐపీఎల్ 2025 లో ​చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శనతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే అవుట్ అయింది. ఆడిన 11 మ్యాచ్ లలో కేవలం 2 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న సీఎస్‌కే జట్టుకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది.

26

సీజన్ ప్రారంభంలో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ధోనీ మళ్లీ కెప్టెన్ అయినప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు. ధోనీ వ్యక్తిగత ప్రదర్శనలు కూడా చెప్పుకోదగ్గగా లేవు. 

36

ఈసారి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ధోనీ విఫలమయ్యారు. ఫినిషర్ ధోనీ అనే పేరుకు తగ్గట్టుగా ఆయన ఆట లేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ధోనీపై నమ్మకం కోల్పోయారని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధోని ఉండగానే మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ తో చెన్నైటీమ్ ఒప్పందం చేసుకుంది. 

46

ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో చెన్నై యంగ్ వికెట్ కీపర్-బ్యాటర్ ఊర్విల్ పటేల్‌తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్ అనే ఘనత ఊర్విల్ పటేల్ సొంతం. కేవలం 28 బంతుల్లోనే టీ20 సెంచరీ సాధించారు.

56

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై ఊర్విల్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించారు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ ప్రపంచ రికార్డును కేవలం 1 బంతితో కోల్పోయాడు. కానీ, దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అనేక రికార్డులు సాధించాడు. 

66

యంగ్ వికెట్ కీపర్ తో ఒప్పందం క్రమంలో మరోసారి ధోని పేరు హాట్ టాపిక్ గా మారింది. ధోని పై చెన్నై సూపర్ కింగ్స్ నమ్మకం కోల్పోయినట్టుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

అయితే, ఊర్విల్ పటేల్‌ను సీఎస్‌కే అధికారులు జట్టులోకి తీసుకోవడం ధోనీపై నమ్మకం కోల్పోయినందువల్ల కాదు, వికెట్ కీపర్ వంశ్ బేడీ గాయం కారణంగా దూరమైనందువల్లేనని చెబుతున్నారు. కానీ, పరిస్థితి అలా కనిపించడం లేదు. రాబోయే సీజన్ లో ధోనిని చూడటం కష్టమేనని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories