తొలి భారత ప్లేయ‌ర్ గా నితీష్ కుమార్ రెడ్డి సరికొత్త రికార్డులు ఇవి

First Published | Dec 28, 2024, 6:22 PM IST

Nitish Kumar Reddy: భార‌త్-ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సూప‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. క‌ష్ట స‌మ‌యంలో భారత్ కు విలువైన ఇన్నింగ్స్ ఆడి కొత్త రికార్డులు సాధించాడు. 
 

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జ‌రుగుతోంది. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న నాల్గో మ్యాచ్ లో టీమిండియా యంగ్ ఆల్ రౌండ‌ర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత‌మైన బ్యాటింగ్ తో సెంచ‌రీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ చేశాడు. దీంతో ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది.

క‌ష్ట స‌మ‌యంలో భార‌త్ కు విలువైన ఇన్నింగ్స్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు వ‌రుస‌గా వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచారు. అయితే, 8వ స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చిన నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో రాణించాడు. ఈ క్ర‌మంలోనే పెద్ద రికార్డును త‌న‌పేరు మీద న‌మోదుచేసుకున్నాడు. మెల్ బోర్న్ మైదానంలో తన టెస్టు కెరీర్ లో నాలుగో మ్యాచ్ ఆడేందుకు నితీశ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగాడు. అంతకుముందు టెస్టు కెరీర్‌లో హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. ఈ మ్యాచ్‌లో అతడి నుంచి భారత జట్టుకు భారీ స్కోరు అవసరం అయింది. దానికి అనుగుణంగా సెంచ‌రీ కొట్టి భార‌త్ కు మెరుగైన స్కోర్ అందించాడు.


Nitish Kumar Reddy

ఏ ఇండియన్ ప్లేయ‌ర్ సాధించ‌ని రికార్డు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి

మెల్ బోర్న్ లో అద్భుత‌మైన బ్యాటింగ్ తో సెంచ‌రీ కొట్టిన నితీష్ కుమార్ త‌న ఇన్నింగ్స్ ప‌లు రికార్డులు సాధించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూనే సెంచరీ పూర్తి చేశాడు. ఇంతకుముందు, ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు ఏ భారత బ్యాట్స్‌మెన్ ఇలాంటి ఫీట్ సాధించ‌లేదు. అలాగే, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అతని సిక్సర్ల సంఖ్య 8కి చేరింది. ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన తొలి భారత ప్లేయ‌ర్ నితీష్ కుమార్ రెడ్డి. అలాగే, ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో విజిటింగ్ బ్యాటర్ ద్వారా అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును దిగ్గ‌జ ప్లేయ‌ర్ల‌తో పంచుకుంటున్నాడు. నితీష్ రెడ్డి కంటే ముందు మైఖేల్ వాన్ (2002-03 యాషెస్), క్రిస్ గేల్ (2009-10) ఒకే సిరీస్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టారు.

Shubman Gill-Nitish Kumar Reddy

ఆస్ట్రేలియాలో సెంచ‌రీ కొట్టిన 3వ‌ అతిపిన్న వ‌య‌స్కుడైన బ్యాట‌ర్ నితీష్ కుమార్ రెడ్డి 

ఆస్ట్రేలియాలో 8వ ర్యాంక్‌ బ్యాటింగ్‌ చేసి, తొలి సెంచరీ కొట్టిన బ్యాట‌ర్ నితీష్ కుమార్ రెడ్డి. అలాగే, ఈ సెంచ‌రీతో నితీష్ కుమార్ రెడ్డి భార‌త దిగ్గజ ప్లేయర్ స‌చిన్ టెండూల్క‌ర్, స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ రిష‌బ్ పంత్ ల‌తో కూడిన ప్ర‌త్యేక క్ల‌బ్ లో చేరాడు. ఆసీస్ గ‌డ్డ‌పై సెంచ‌రీ కొట్టి మూడో పిన్న వ‌య‌స్కుడైన భార‌త ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఈ లిస్టులో లిటిల్ మాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ టాప్ లో ఉన్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్ 1992లో సిడ్నీలో 18 ఏళ్ల 253 రోజుల వయసులో సెంచరీ  సాధించాడు. ఆ త‌ర్వాత‌ రిషబ్ పంత్ 2019లో సిడ్నీలో 21 ఏళ్ల 91 రోజుల వయసులో సెంచరీ కొట్టిన రెండో అతి పిన్న వయస్కుడైన బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి 12 ఏళ్ల 216 రోజుల వ‌య‌స్సులో ఆసీస్ గ‌డ్డ‌పై సెంచ‌రీ కొట్టాడు.

Nitish Kumar Reddy

బోర్డర్- గవాస్కర్ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులో నితీష్ కుమార్ రెడ్డికి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అతను ఇప్పటివరకు 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 284 పరుగులు చేశాడు. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో భారత జట్టు తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. ఈ సమయంలో అతను 90 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 26 మ్యాచ్‌లు ఆడ‌గా, 958 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. IPL 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.

Latest Videos

click me!