Nitish Kumar Reddy
Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి దెబ్బ పడింది. యంగ్ ప్లేయర్ నితీస్ కుమార్ రెడ్డి దెబ్బకు ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. స్టార్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ పెవిలియన్ బాటపట్టిన సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. కష్ట సమయంలో భారత్ కు విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
Nitish Kumar Reddy
పుష్ప స్టైల్లో హాఫ్ సెంచరీ.. బాహుబలి స్టైల్లో సంచరీ సంబరాలు
తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న నితీష్ కుమార్ రెడ్డికి బాక్సింగ్ డే టెస్టులో సాధించిన సెంచరీ తన టెస్టు కెరీర్ లో మొదటి. బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన నితీష్ కుమార్.. సెంచరీని కూడా బౌండరీతోనే పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత పుష్ప స్టైల్లో.. "నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. నీయవ్వ తగ్గేదే లే" అంటూ తన అర్థ సెంచరీ సంబరాలు చేసుకున్నాడు. అదే మాదిరిగా ప్రభాస్ బాహుబలి స్టైల్లో సెంచరీ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nitish Kumar Reddy
10 ఫోర్లు, 1 సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన నితీష్ కుమార్ రెడ్డి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. 115వ ఓవర్‌లో సెంచరీని అందుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 105* పరుగులతో క్రీజులో ఉన్నాడు. తన ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 10 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్ భారత్ 358/9 పరుగులతో మూడో రోజు ఆటను ముగించింది.
Nitish Kumar Reddy
ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి
ఈ సెంచరీతో నితీష్ కుమార్ రెడ్డి భారత దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్, స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ లతో కూడిన ప్రత్యేక క్లబ్ లో చేరాడు. ఆసీస్ గడ్డపై సెంచరీ కొట్టి మూడో పిన్న వయస్కుడైన భారత ప్లేయర్ గా నిలిచాడు. ఈ లిస్టులో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 1992లో సిడ్నీలో 18 ఏళ్ల 253 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 2019లో సిడ్నీలో 21 ఏళ్ల 91 రోజుల వయసులో సెంచరీ కొట్టిన రెండో అతి పిన్న వయస్కుడైన బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి 12 ఏళ్ల 216 రోజుల వయస్సులో ఆసీస్ గడ్డపై సెంచరీ కొట్టాడు.
Nitish Kumar Reddy-Washington Sundar
సెంచరీతో క్రికెట్ లో తుఫాను తెచ్చిన నితీష్ కుమార్ రెడ్డి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే నితీష్ కుమార్ రెడ్డి టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. మెల్ బోర్న్ టెస్టులో నితీష్ రెడ్డి ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. నితీష్ రెడ్డి తన ఇన్నింగ్స్‌లో మొదటి నుండి మంచి టచ్‌లో కనిపించాడు. టెస్టు క్రికెట్‌తో పాటు ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్‌రెడ్డికి ఇదే తొలి సెంచరీ. మెల్‌బోర్న్ పిచ్‌పై సెంచరీ చేయడం ద్వారా నితీశ్‌రెడ్డి ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ అని ప్రపంచానికి చాటిచెప్పాడు. భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన పిచ్ పై సెంచరీతో దుమ్మురేపాడు నితీష్ కుమార్ రెడ్డి. దీంతో ఇప్పుడు అతను నెట్టింట్ ట్రెండ్ గా మారాడు.