బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అత్య‌ధిక ఫోర్లు బాదిన టాప్-10 ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా?

First Published | Dec 27, 2024, 8:29 PM IST

IND vs AUS: మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్ - ఆస్ట్రేలియాలు నాల్గో టెస్టు ఆడుతున్నాయి. అయితే, బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో రికార్డుల విష‌యానికి వ‌స్తే అత్య‌ధిక ఫోర్లు బాదిన ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా? 
 

Image credit: PTI

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఉత్కంఠ‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భార‌త్-ఆస్ట్రేలియాలు మెల్ బోర్న్ లో నాల్గో టెస్టు ఆడుతున్నాయి. అయితే, బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ప్లేయ‌ర్ల రికార్డులు గ‌మ‌నిస్తే.. 25 మ్యాచ్‌లు, 44 ఇన్నింగ్స్‌లలో భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మొత్తం 227 ఫోర్లు బాదాడు. అయితే, ఈ ట్రోఫీలో అత్య‌ధిక ఫోర్లు బాదిన టాప్-10 ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా?

Sachin Tendulkar

1. సచిన్ టెండూల్కర్ 
భారత దిగ్గ‌జ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్కర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 39 మ్యాచ్‌లు, 74 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 391 ఫోర్లు బాది ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు.

2. వీవీఎస్ లక్ష్మ‌ణ్
భార‌త మాజీ బ్యాటింగ్ దిగ్గ‌జం వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో 29 మ్యాచ్ లు, 54 ఇన్నింగ్స్ ల‌లో 338 ఫోర్లు బాదాడు. 


Image credit: ICCFacebook

3. రికీ పాంటింగ్  
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 29 మ్యాచ్‌లు, 51 ఇన్నింగ్స్‌లలో 278 ఫోర్లు కొట్టాడు. 

4. రాహుల్ ద్రవిడ్
భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 33 మ్యాచ్‌లు, 62 ఇన్నింగ్స్‌లలో 269 ఫోర్లు సాధించాడు.

cricket virender sehwag

5. వీరేంద్ర సెహ్వాగ్
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 23 మ్యాచ్‌లు, 45 ఇన్నింగ్స్‌ల్లో 244 ఫోర్లు సాధించాడు.

6. చెతేశ్వర్ పుజారా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 25 మ్యాచ్‌లు, 45 ఇన్నింగ్స్‌లలో 228 ఫోర్లు బాదాడు భారత వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా.

7. విరాట్ కోహ్లీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 25 మ్యాచ్‌లు, 44 ఇన్నింగ్స్‌లలో భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 227 ఫోర్లు బాదాడు. 

8. మైఖేల్ క్లార్క్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 22 మ్యాచ్‌లు, 40 ఇన్నింగ్స్‌లలో 227 ఫోర్లు సాధించాడు.

Steve Smith

9. స్టీవ్ స్మిత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 19 మ్యాచ్‌లు, 37 ఇన్నింగ్స్‌ల్లో 226 ఫోర్లు సాధించాడు.

10. మాథ్యూ హేడెన్
ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్ మాథ్యూ హేడెన్ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో 24 మ్యాచ్ లు, 43 ఇన్నింగ్స్ ల‌లో 214 ఫోర్లు బాదాడు.

Latest Videos

click me!