ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (Delhi Premier League)లో నితీష్ రాణా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కి ఘనవిజయం అందించాడు. రాజస్థాన్ రాయల్స్‌లో సంజు శాంసన్‌తో కలసి ఆడిన రాణా ఈసారి ఢిల్లీ లీగ్‌లో తానేంటో నిరూపించాడు.
25
ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాణా గర్జన
ఎలిమినేటర్ పోరులో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టుతో బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుకు రాణా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాణా.. 55 బంతుల్లోనే 134 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
35
ఫోర్లు, సిక్సర్ల వర్షం
రాణా ఆటతీరు పూర్తిగా ఆగ్రెసివ్‌గా సాగింది. మొత్తం 8 ఫోర్లు, 15 సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేశాడు. దిగి ఆడిన ప్రతీ బౌలర్‌పై దాడి చేసిన రాణా, ముఖ్యంగా దిగ్వేష్ రాథీ బౌలింగ్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. రాథీ వేసిన రెండు ఓవర్లలోనే 39 పరుగులు వచ్చాయి.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కోసం ఆడిన రాణా గత సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 217 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి 36 బంతుల్లో 81 పరుగులు చేసినా తర్వాత గాయాలు, ఫామ్ లోపం కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో కూడా అతను కేవలం 135 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఈసారి ఎలిమినేటర్‌లో ఘనమైన సెంచరీతో ఫామ్‌లోకి తిరిగొచ్చాడు.
55
ఫైనల్ అవకాశాలపై లయన్స్ దృష్టి
రాణా బ్యాటింగ్‌తో వెస్ట్ ఢిల్లీ లయన్స్ 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేశారు. ఇదే టోర్నమెంట్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఇప్పటికే ఫైనల్లోకి చేరింది. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరగనున్న రెండో క్వాలిఫయర్ గెలిస్తే, వెస్ట్ ఢిల్లీ లయన్స్ కూడా ఫైనల్‌కి అర్హత సాధిస్తారు.