IND vs WI : నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్.. అదరగొట్టేశాడు భయ్యా

Published : Oct 04, 2025, 09:13 PM IST

Nitish Kumar Reddy Stunning Catch: వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు.

PREV
15
నితీష్ కుమార్ రెడ్డి కళ్లు చేదిరే క్యాచ్

వెస్టిండీస్ పై భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన కళ్లుచేదిరే క్యాచ్ పట్టాడు. ఈ మ్యాచ్‌లో మూడవ రోజు మొదటి సెషన్ లో పక్కకు డైవింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టారు. ఈ అద్భుతమైన క్యాచ్ తో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ పెవిలియన్ కు చేరాడు.

నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ క్యాచ్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 8 రన్స్ వద్ద నితీస్ రెడ్డి క్యాచ్ తో అవుట్ అయ్యాడు.

25
అదరగొట్టిన భారత్

భారత జట్టు ఈ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టింది. మొదటి ఇన్నింగ్స్‌లో 448/5 రన్‌లతో డిక్లేర్ చేసి 286 పరుగుల లీడ్ సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. మొదటి సెషన్‌లోనే వెస్టిండీస్ ఆటగాళ్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. నితీష్ రెడ్డి క్యాచ్ తర్వాత జాన్ క్యాంప్‌బెల్ 14, బ్రాండన్ కింగ్ 5, రోస్టన్ చేజ్ 1, షాయ్ హోప్ 1 రన్స్‌తో అవుట్ అయ్యారు. లంచ్ సమయంలో విండీస్ స్కోర్ 66/5. ఆ తర్వాత వికెట్లు కూడా త్వరగానే కోల్పోయింది. 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింది.

35
బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొట్టిన రవీంద్ర జడేజా

ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా సెంచరీతో బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు. జడేజా 104 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఆల్ రౌండ్ ప్రదర్శన భారత్‌కు ఒక ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో విజయాన్ని అందించడంలో కీలకంగా మారింది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. కేవలం 54 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మహ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు.. మొత్తంగా 7 వికెట్లతో ఈ మ్యాచ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో జడేజాతో పాటు కేఎల్ రాహుల్, జురేల్ సెంచరీలు కొట్టారు. గిల్ హాఫ్ సెంచరీ నాక్ ఆడాడు. 

45
నితీష్ రెడ్డి ఫీల్డింగ్ మంత్రం

22 ఏళ్ల నితీష్ రెడ్డి అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ తెలుగు యంగ్ ప్లేయర్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయకపోయినా, ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ షార్ట్ బంతిని షాట్ ఆడగా, స్క్వేర్ లెగ్ వద్ద డైవ్ చేసి క్యాచ్ తీసుకోవడం హైలెట్ గా నిలిచింది. సోషల్ మీడియా లో ఈ క్యాచ్ వీడియో వైరల్ గా మారింది.

55
నితీష్ రెడ్డి ఇంటర్నేషనల్ ప్రొఫైల్

నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు 8 టెస్ట్‌లలో 343 పరుగులు (సగటు 28.58) కొట్టాడు. అలాగే, 8 వికెట్లు (సగటు 37.62) కూడా తీశాడు. ఆస్ట్రేలియాలో డెబ్యూ సిరీస్‌లో మంచి ప్రదర్శనతో ఇంగ్లాండ్ టూర్ కు కూడా జట్టులో ఉన్నాడు. అయితే, ఇంగ్లాండ్ టూర్‌లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. ఈ హోమ్ సిరీస్‌లో తన ప్రతిభను మరోసారి చూపించాలనే పట్టుదలో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories