KL Rahul: వెస్టిండీస్ పై భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో సెంచరీ సాధించాడు. 9 ఏళ్ల తర్వాత భారత్ లో సెంచరీ కొట్టడంతో పాటు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ రికార్డులను బద్దలు కొట్టాడు.
అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సెంచరీ నాక్ తో మరో ఘనత సాధించాడు. 32 ఏళ్ల రాహుల్ 9 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్ట్ సెంచరీ సాధించాడు.
రెండో రోజు మార్నింగ్ సెషన్‌లో 190 బంతుల్లో 12 బౌండరీలతో అతను సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఆయన 3211 రోజుల తర్వాత దేశవాళీ మైదానాల్లో సెంచరీ నమోదు చేశాడు. మంచి షాట్స్ తో ఆకట్టుకున్నాడు.
కేఎల్ రాహుల్ 197 బంతుల్లో సెంచరీ (100 పరుగులు) సాధించాడు. ఓపెనర్‌గా ఇది ఆయన 10వ టెస్ట్ సెంచరీ. దీంతో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ (9 సెంచరీలు) రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు భారత్ తరఫున టెస్ట్ ఓపెనర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ రోహిత్, గంభీర్ లను దాటేసి నాలుగో స్థానంలో నిలిచాడు.
ఓపెనర్లుగా టెస్ట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు
• 33 – సునీల్ గవాస్కర్
• 22 – వీరేంద్ర సెహ్వాగ్
• 12 – మురళీ విజయ్
• 10 – కేఎల్ రాహుల్
• 9 – రోహిత్ శర్మ
• 9 – గౌతమ్ గంభీర్
36
విరాట్ కోహ్లీని అధిగమించిన కేఎల్ రాహుల్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇది కేఎల్ రాహుల్‌కు ఆరో సెంచరీ కావడం విశేషం. దీంతో ఆయన విరాట్ కోహ్లీ 5 సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌లతో సమానంగా 6 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తలా 9 సెంచరీలతో టాప్ లో ఉన్నారు.
WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లు
కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా 26వసారి టెస్ట్‌లో 50 ప్లస్ స్కోరును నమోదు చేశాడు. దీంతో ఆయన భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక 50+ ఇన్నింగ్స్ ఆడిన జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.
భారత ఓపెనర్లు టెస్ట్‌లో 50+ ఇన్నింగ్స్ లు
• 75 – సునీల్ గవాస్కర్
• 51 – వీరేంద్ర సెహ్వాగ్
• 31 – గౌతమ్ గంభీర్
• 27 – మురళీ విజయ్
• 26 – కేఎల్ రాహుల్
56
నిప్పిల్ సెలబ్రేషన్ తో అదరగొట్టిన కేల్ రాహుల్
కేఎల్ రాహుల్ తన సెంచరీ పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. హెల్మెట్ తీసి డ్రెస్‌రూమ్ వైపు బ్యాట్ ఎత్తి చూపాడు. అనంతరం రెండు వేళ్లను నోటిలో పెట్టుకున్నాడు. ఆయనకు ఇటీవల పుట్టిన కుమార్తె ఇవారాకు అంకితం చేసినట్లు భావిస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో “నిప్పిల్ సెలబ్రేషన్” పేరుతో వైరల్ అవుతోంది.
66
2016 తర్వాత తొలి హోం సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ చివరిసారిగా భారత్‌లో టెస్ట్ సెంచరీని 2016 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌పై సాధించాడు. ఆ టెస్ట్‌లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో కూడా దుమ్మురేపాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత రాహుల్ తన సెంచరీల ఖాతా మళ్లీ తెరిచాడు. ప్రస్తుత సీజన్‌లో ఆయన అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 532 పరుగులు చేయగా, అందులో రెండు సెంచరీలు సాధించాడు.