ఐపీఎల్ 18వ సీజన్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025) మార్చి 14న మొదలవుతుంది. అయితే, ఐపీఎల్ 2025 మొదటి 3 వారాల్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ తో సిరీస్ ఆడనుంది. 5 టీ20లు, 3 వన్డేలు మార్చి 16 నుండి ఏప్రిల్ 5 వరకు జరుగుతాయి. దీంతో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రా, మిచెల్ సాంట్నర్, లక్కీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్, బెవన్ జాకబ్స్ లాంటి న్యూజిలాండ్ ఆటగాళ్ళు ఐపీఎల్ ఆడతారా లేదా అన్నది సందేహం.